తెలంగాణ

రాజ్యసభ కసరత్తు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: రాజ్యసభకు ఎంపికచేసే అభ్యర్థులపై పాలకపక్షం తెరాసలో కసరత్తు తుది దశకు చేరుకున్నట్టు సమాచారం. మంగళవారం రాత్రి ఫామ్‌హౌస్‌కు చేరుకున్న సిఎం కె చంద్రశేఖర్‌రావు బుధవారం అక్కడి నుంచే పార్టీ ముఖ్యులు కొందరితో ఈ అంశంపై చర్చించినట్టు సమాచారం. ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్‌కు చేరుకోగానే పార్టీ ముఖ్యులు కొందరితో చర్చించిన తర్వాత సిఎం ప్రకటించడానికి రంగం సిద్ధమైనట్టు పార్టీ వర్గాల సమాచారం. ఒకటి రెండు రోజుల్లోనే రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ ముఖ్యుడు ఒకరు చెప్పారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలు కూడా తెరాసకే దక్కనుండటంతో ఇందులో ఒకటి బీసీ సామాజిక వర్గానికి, మరొటి ఓసీలకు కేటాయించాలని సిఎం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. పార్టీనుంచి రాజ్యసభకు ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి కేటాయించడంతో ఈసారి కూడా మరో స్థానాన్ని బీసీకే ఇచ్చే అవకాశం ఉండదన్న అంచనాతో బీసీ నాయకుల నుంచి సిఎంపై పెద్దగా వత్తిడి లేదని పార్టీ వర్గాల సమాచారం. అయితే ప్రత్యేక కేసుగా తనకు రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డి శ్రీనివాస్ ఒక్కరే సిఎంపై వొత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్‌నుంచి పార్టీలోకి వచ్చిన సీనియర్ నేతగా, గతంలో పీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన అనుభవం, బీసీ సామాజిక వర్గం కోటా కింద డిఎస్‌కు అవకాశం తప్పకుండా ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సిఎం నుంచి డిఎస్‌కు స్పష్టమైన హామీ లభించకపోవడంతో చివరిదాకా సస్పెన్స్ తప్పదని పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. సిఎం కెసిఆర్ నిర్ణయాలు ఎప్పుడూ ఆశ్చర్యకరంగానే ఉంటాయని, రాజ్యసభకు కూడా ఎవరూ ఉహించని విధంగా ఎంపిక జరిగినా ఆశ్చర్యం లేదని పార్టీ నేతలు అంటున్నారు. రాజ్యసభ రెండవ స్థానం కోసం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి మధ్యనే తీవ్ర పోటీ నెలకొంది. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సిఎం కెసిఆర్‌కు సన్నిహితుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అయితే గతంలో తనకు ఇచ్చిన హామీ మేరకు ఈసారి తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా పత్రికాధిపతి సిఎల్ రాజం మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రిని కలిసి కోరినట్టు తెలిసింది. అయితే ఆయనకూ సిఎం నుంచి హామీ లభించలేదని సమాచారం. వీరిద్దరితో పాటు పార్టీ, ముఖ్యమంత్రి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలను చూసే దామోదర్‌రావు పేరు కూడా రాజ్యసభకు పరిశీలనలో ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.