S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/25/2016 - 12:13

వరంగల్: పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని మనస్తాపం చెంది ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించిన ఘటన వరంగల్ జిల్లా శాయంపేట మండలం పెదకొండపాకలో బుధవారం జరిగింది. ఈ గ్రామానికి చెందిన దేవేందర్, నవ్య కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసేందుకు పెద్దలు నిరాకరించడంతో వీరు పురుగుమందు తాగారు. స్థానికులు వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించారు. వీరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని పోలీసులు తెలిపారు.

05/25/2016 - 12:13

ఆదిలాబాద్: అత్తింటి వారి నుంచి వరకట్నం కోసం వేధింపులు అధికం కావడంతో శ్రీదేవి అనే 26 ఏళ్ల వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగుచూసింది. బెజ్జంకి మండలం లంబాడితండాలో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

05/25/2016 - 08:53

హైదరాబాద్, మే 24: గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ కట్టుబడి ఉన్నారని మహబూబాబాద్ ఎంపి సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్ అన్నారు.

05/25/2016 - 08:43

నర్సంపేట, మే 24: వరంగల్ జిల్లా గూడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న కేసముద్రం విఆర్‌ఎ బెజ్జం రంజిత్‌కుమార్ కొద్దిగంటలకే మృతి చెందాడు. దీంతో మృతుని బంధువులు, ప్రజా సంఘాల నాయకుల ఆందోళనతో నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల దెబ్బలకే రంజిత్‌కుమార్ మృతి చెందాడని మృతుడి బంధువులు ఐదు గంటల పాటు ధర్నా చేపట్టారు. రంజిత్ స్నేహితులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

05/25/2016 - 08:42

వరంగల్, మే 24: గత ప్రభుత్వ విధానాలనే తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తోందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. మంగళవారం వరంగల్ నగరంలో జరిగిన తెలంగాణ ప్రజాస్వామిక వేదిక బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలతోనే ఏర్పడిందని, ఆదివాసీ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం నిర్బంధించే ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు.

05/25/2016 - 08:41

మహబూబ్‌నగర్, మే 24: రాజోళిబండ మళ్లింపు పథకం దగ్గర కర్ణాటక పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య వివాదాల సుడిగుండంగా మారిన ఆర్డీఎస్ వ్యవహారం ప్రతియేటా చిలికిచిలికి గాలివానలా మారి వివాదాలకు నిలయంగా మారుతోంది. ఇదే అదనుగా భావించిన కర్ణాటక సైతం ఆధునికీకరణ పనుల విషయంలో మరింత జాప్యం చేస్తోంది.

05/25/2016 - 08:40

మోర్తాడ్, మే 24: తమ గ్రామాభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందున 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామని నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గుమ్మిర్యాల గ్రామ కమిటీ తీర్మానించింది. మంగళవారం గ్రామంలో సమావేశమైన గ్రామస్థులంతా విడిసి ఆధ్వర్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

05/25/2016 - 08:43

కొత్తూరు, మే 24: సినీ హీరో ప్రిన్స్ మహేష్‌బాబు భార్య నమ్రత శిరోద్కర్ దత్తత గ్రామంలో పర్యటించడంతో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చించడంతో మహబూబ్‌నగర్ జిల్లా సిద్దాపూర్ గ్రామ ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

05/25/2016 - 08:39

హైదరాబాద్, మే 24: ఆంధ్ర, తెలంగాణ మధ్య వివాదాస్పదంగా మారిన రాజోళిబండ ప్రాజెక్టు ఎత్తు పెంచే అంశం కొత్త మలుపుతిరిగింది. ఉభయ రాష్ట్రాలు సయోధ్య కుదుర్చుకుని ఒక రాజీ ఫార్ములాను సూచించాలని.. అప్పుడే ఆర్డీఎస్ ఎత్తు పెంపుపై ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని ఏపీ ఇంజనీర్ల బృందానికి కర్నాటక తేల్చి చెప్పినట్లు సమాచారం.

05/25/2016 - 08:25

హైదరాబాద్, మే 24: తెలంగాణలో పార్టీ బలోపేతానికి చాలా సీరియస్‌గా ముందుకెళ్లాలని బిజెపి రాష్ట్ర నాయకులు నిర్ణయించారు. రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా అడుగులు వేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ నెల 30న తెలంగాణ రాష్ట్రానికి రానున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనను విజయవంతం చేయాలని నిర్ణయించారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.

Pages