S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/26/2016 - 15:00

హైదరాబాద్: ఆడపిల్ల పుట్టినందున ఇంట్లో అడుగుపెట్టవద్దంటూ భర్త ఆంక్షలు విధించడంతో ఓ ఇల్లాలు న్యాయం కోసం బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన బాలల హక్కుల సంఘం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు, ఎల్‌బి నగర్ ఎసిపికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై నివేదిక ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

05/26/2016 - 14:59

ఆదిలాబాద్: బెల్లంపల్లి కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్షం నేతృత్వంలో గురువారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ప్రారంభించారు. బెల్లంపల్లి వద్ద రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ప్రభుత్వ స్థలాలు, సింగరేణి భవనాలు, ఇతర అనుకూలతలు ఉన్నందున బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

05/26/2016 - 12:41

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో టాప్ టెన్ ర్యాంకర్ల వివరాలను డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి గురువారం ప్రకటించారు. ఇంజినీరింగ్ విభాగంలో మొదటి పది ర్యాంకుల్లో అబ్బాయిల హవా కొనసాగింది. ఇంజినీరింగ్‌, వ్యవసాయ సంబంధ కోర్సులకు సంబంధించి మాత్రమే ఫలితాలు విడుదల చేస్తున్నట్లు కడియం శ్రీహరి వెల్లడించారు. అభ్యర్థులు జూన్‌ 6 నుంచి ర్యాంక్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

05/26/2016 - 11:57

హైదరాబాద్: ఈసిఐఆల్ ప్రాంతంలోని భవానీనగర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి సాయికుమార్ రెండురోజులుగా అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

05/26/2016 - 11:57

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌లో ఇంజినీరింగ్‌కు సంబంధించి ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం విడుదల చేశారు. ఈ పరీక్షలో 77.88 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. టి.ఎంసెట్‌కు మొత్తం 2,46,540 మంది దరఖాస్తు చేసుకోగా, ఇంజినీరింగ్‌కు 1,33,488 మంది, మెడికల్‌కు 90,114 మంది హాజరయ్యారు.

05/26/2016 - 11:57

కరీంనగర్: వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి ఆమె వొంటిపై నుంచి రెండు తులాల బంగారు నగలను దుండగులు దోచుకువెళ్లారు. ఈ సంఘటన చొప్పదండి మండలం వెదురుగడ్డలో బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగింది. దుండగుల చేతిలో రామమల్లమ్మ అనే వృద్ధురాలు హత్యకు గురైనట్లు స్థానికులు గురువారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

05/26/2016 - 06:58

హైదరాబాద్, మే 25: బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు బుధవారం మహానగరాన్ని మరోసారి వణికించాయి. ఉదయం నుంచి ఎండ బాగా మండిపోయి సాయంత్రం అయిదుగంటల తర్వాత ఒక్కసారి ఆకాశం మేఘావృతమై బలమైన గాలులతో వర్షం కురిసింది. కొద్ది సేపే కురిసినా, అపుడే ఆఫీసుల నుంచి ఇంటికెళ్లేందుకు బయటకొచ్చి బస్టాపుల్లో వేచి ఉన్న ప్రయాణికులు, రోడ్డుపై ప్రయాణిస్తున్న వారు బలమైన గాలులతో భయానికి గురయ్యారు.

05/26/2016 - 06:58

హైదరాబాద్, మే 25: తెలంగాణ రాష్ట్రంలోని గొర్రెల కాపర్లు, మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇచ్చే నష్టపరిహారాన్ని ఐదులక్షల రూపాయలకు పెంచేందుకు వీలుగా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అధికారులకు సూచించారు. సచివాలయంలోని తన చాంబర్‌లో మంత్రి సంబంధిత అధికారులతో బుధవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

05/26/2016 - 06:57

హైదరాబాద్, మే 25 : రైతులకు చేయూత ఇచ్చేందుకు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూపొందించిన వడ్డీలేని రుణాలు, పావలావడ్డీపై రుణాల పథకం 2016-17 సంవత్సరంలో కూడా కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లక్ష రూపాయలలోపుగా పంట రుణాలు తీసుకునే రైతులు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా వారి తరపున ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది.

05/26/2016 - 06:56

హైదరాబాద్, మే 25: నగరంలోని గోషామహల్ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడి హత్యకు కుట్ర జరిగింది. భూవివాదాలతోనే టిఆర్‌ఎస్ నేత ఆనంద్‌కుమార్ గౌడ్ హత్యకు మాజీ కార్పొరేటర్ మధు కుట్రపన్నాడని అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ అంజయ్య తెలిపారు. ఈ హత్య కుట్ర వెనుక ఓ మాజీ మంత్రి తమ్ముడు మధుకు పిఎగా వ్యవహరిస్తున్న అలీ ఉన్నాడని ఆయన పేర్కొన్నారు.

Pages