తెలంగాణ

గొర్రెల కాపర్లు మరణిస్తే రూ. 5లక్షల పరిహారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: తెలంగాణ రాష్ట్రంలోని గొర్రెల కాపర్లు, మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇచ్చే నష్టపరిహారాన్ని ఐదులక్షల రూపాయలకు పెంచేందుకు వీలుగా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అధికారులకు సూచించారు. సచివాలయంలోని తన చాంబర్‌లో మంత్రి సంబంధిత అధికారులతో బుధవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం ఇస్తున్న ఎక్స్‌గ్రేషియా లక్ష రూపాయలుగా ఉందని గుర్తు చేశారు. రాష్టవ్య్రాప్తంగా వివిధ కోణాల్లో వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ఎక్స్‌గ్రేషియా పెంచాలని భావిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కెసిఆర్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో మత్స్యకారులందరికీ గృహనిర్మాణ శాఖ ద్వారా ఇళ్లను మంజూరు చేయించాలని అధికారులకు మంత్రి సూచించారు. వర్షాలు బాగానే ఉంటాయని భావిస్తుండటంతో అన్ని జిల్లాల్లో చేపలను పెంచేందుకు వీలుగా చేపపిల్లల పంపిణీని జూలై 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మల్‌లో 50 లక్షల రూపాయలతో నిర్మించబోయే బిఎంసి కేంద్రం అభివృద్ధికి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో 15-20 ఎకరాల భూమిని గుర్తించి హరితహారం కింద చెట్లు, మొక్కలను పెంచాలని గొర్రెలు, మేకల గ్రాసం కోసం ఈ భూమిని వినియోగించాలని సూచించారు. విజయ డెయిరీ చేస్తున్న ఉత్పత్తులన్నింటితో గిఫ్ట్ ప్యాక్‌లను తయారుచేసి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులకు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని ఆదేశించారు.