S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/15/2016 - 04:38

హైదరాబాద్, మే 14: తెలంగాణ పోలీస్ విభాగం నిస్సహాయకులకు చేయూతనిచ్చేందుకు దేశంలోనే ప్రప్రథమంగా ప్రవేశపెట్టిన ‘్భరోసా’ మహిళలకు భరోసా కల్పిస్తుంది. హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా నమోదైన కేసు ఫలించడంతో మహిళల్లో సంతోషం వ్యక్తమవుతోంది. విధినిర్వహణలో నిమగ్నమయిన మహిళా పోలీసులు సామాజిక దృక్పథంతో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన ఓ నిండు గర్భిణికి కౌనె్సలింగ్ ఇచ్చి ఆసుపత్రిలో చేర్పించారు.

05/14/2016 - 12:25

హైదరాబాద్: పలు ప్రాంతాల్లో చోరీలు చేస్తూ ఇన్నాళ్లూ తప్పించుకుతిరుగుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నగరంలోని వెస్ట్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు కార్లు, 33 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

05/14/2016 - 12:23

ఖమ్మం: పాలేరు ఉప ఎన్నికలో గెలుపుకోసం అధికార తెరాస పార్టీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సిపిఐ నాయకులు తమ్మినేని వీరభద్రం, పువ్వాడ నాగేశ్వరరావు ఆరోపించారు. ఎన్నికల సంఘానికి బదులు తెరాస పార్టీయే ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్టు అనిపిస్తోందని వారన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాసే పార్టీలకు ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు.

05/14/2016 - 12:22

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పలు పబ్‌ల్లో పోలీసులు తనిఖీలు చేశారు. డ్రగ్స్ వినియోగం గురించి ఆరా తీసి, డాగ్ స్క్వాడ్‌తో సోదాలు చేపట్టారు.

05/14/2016 - 12:22

హైదరాబాద్: గండిపేటలోని ఓ ఫాంహౌస్‌లో శుక్రవారం రాత్రి దుండగులు ఓ బాలికపై అత్యాచారం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. బీభత్సం సృష్టించిన ఆగంతకులు రెండు ల్యాప్‌ట్యాప్‌లను చోరీ చేసినట్లు సమాచారం. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

05/14/2016 - 08:26

హైదరాబాద్, మే 13: దేశంలోనే అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా రిక్రూట్‌మెంట్‌లు నిర్వహించే కమిషన్‌గా ఖ్యాతి గడించిన తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు బ్రోకర్ల బెడద పట్టుకుంది. తమకు ఎవరూ తెలియకున్నా, ఫలానా మెంబర్ తమకు తెలుసు, ఉద్యోగాలు ఇప్పిస్తాం, చైర్మన్ తెలుసు మీకు ఇంటర్వ్యూలో మార్కులు ఇప్పిస్తాం అంటూ బ్రోకర్ల దందా మొదలైంది.

05/14/2016 - 08:23

వినాయక్‌నగర్, మే 13: పెళ్లీడుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఆడపడుచుల తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకంలో నకిలీ పత్రాలతో అవినీతికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

05/14/2016 - 08:16

సంగారెడ్డి, మే 13: ‘కుల విద్య మానకురా గువ్వల చెన్నా’ అన్న నీతి వాక్యాన్ని వారు అక్షరాలా పాటిస్తున్నారు. వృత్తినే నమ్ముకుని కుల సంప్రదాయాన్ని ఆచరిస్తూ కుటుంబ పోషణ జరుపుకుంటున్నారు. కులాల కట్టుబాట్లకు తూట్లు పడి అనేక వృత్తులు చిన్నాభిన్నమైనా గంగిరెద్దుల కుటుంబాలు మాత్రం తమ కుల సంప్రదాయాన్ని యధావిధిగా కొనసాగిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నాయి.

05/14/2016 - 08:15

భూత్పూర్, మే 13: ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగం చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగం కోసం మహబూబ్‌నగర్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గమధ్యలో రహదారిపై లారీ ఢీకొని కొత్త దంపతులు మృత్యువాత గురైన సంఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని అమిస్తాపూర్ సమీపంలో జరిగింది. ఎస్సై అశోక్ కథనం ప్రకారం...

05/14/2016 - 08:14

నర్సంపేట, మే 13: కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిన కాళేశ్వరం బ్యారేజిని నిర్మించి తీరుతామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు.

Pages