తెలంగాణ

గోషామహల్ టిఆర్‌ఎస్ నేత హత్యకు కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: నగరంలోని గోషామహల్ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడి హత్యకు కుట్ర జరిగింది. భూవివాదాలతోనే టిఆర్‌ఎస్ నేత ఆనంద్‌కుమార్ గౌడ్ హత్యకు మాజీ కార్పొరేటర్ మధు కుట్రపన్నాడని అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ అంజయ్య తెలిపారు. ఈ హత్య కుట్ర వెనుక ఓ మాజీ మంత్రి తమ్ముడు మధుకు పిఎగా వ్యవహరిస్తున్న అలీ ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. అలీ అనుచరులు సాల్మన్ హదీ, ఇర్ఫాన్‌లను అఫ్జల్‌గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు అలీ పరారీలో ఉన్నాడని అతని కోసం గాలిస్తున్నట్టు ఇనె్స్పక్టర్ అంజయ్య చెప్పారు.
రక్షణ కల్పించండి: ఆనంద్‌కుమార్ గౌడ్
మాజీ మంత్రి తమ్ముడు మధుగౌడ్ స్థానికంగా అక్రమాలకు పాల్పడుతుండగా టిఆర్‌ఎస్ మంత్రి కెటిఆర్‌కు దృష్టికి తీసుకెళ్లడంతో తనపై కక్ష పెంచుకున్న మధుగౌడ్ తనను హత మార్చేందుకు కుట్రపన్నాడని ఆనంద్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. మధుగౌడ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, అతని నుంచి రక్షణ కల్పించి భద్రతను ఏర్పాటు చేయాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఆదాయ సర్ట్ఫికెట్ల జారీ
అధికారం ఇక డిటిలకు
తహశీల్దార్లకు తగ్గిన పనిభారం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 25: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయం సర్ట్ఫికెట్లు జారీ చేసే అధికారాన్ని డిప్యూటీ తహశీల్దార్లకు (డిటిలకు) కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఈ అధికారం తహశీల్దార్లకు మాత్రమే ఉండేది. తహశీల్దార్లపై పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, వారు మండలాల్లో ఎక్కువగా పర్యటించాల్సి రావడంతో హెడ్‌క్వార్టర్‌లో ఉండే డిప్యూటీ తహశీల్దార్లకు ఈ బాధ్యతను అప్పగించారు. రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రేపు తెలంగాణ ఎడ్‌సెట్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 25: తెలంగాణ ఎడ్‌సెట్‌ను ఈ నెల 27వ తేదీన నిర్వహిస్తున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ పడాల ప్రసాద్ తెలిపారు. పరీక్ష ఉదయం 11 నుండి ఒంటిగంట వరకూ జరుగుతుందని చెప్పారు. అభ్యర్థులు తమ హాల్‌టిక్కెట్లను టిఎస్‌ఎడ్‌సెట్ డాట్ ఆర్గ్ అనే వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్ధులు గంట ముందే చేరుకోవాలని కన్వీనర్ హితవు పలికారు.