S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/26/2016 - 00:25

హైదరాబాద్, మే 25: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

05/25/2016 - 18:17

హైదరాబాద్: నగరంలో బుధవారం సాయంత్రం గాలి దుమారం చెలరేగి పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. సచివాలయం దారిలో తెలుగుతల్లి ఫ్లయ్ ఓవర్‌పై చెట్లు కూలడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పెనుగాలులకు దశాబ్దాల నాటి చెట్లు కూకటివేళ్లతో నేలకూలుతున్నందున నగరంలో బీభత్స వాతావరణం చోటుచేసుకుంటోంది.

05/25/2016 - 17:59

హైదరాబాద్: నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హష్మీ హత్యకు సంబంధించి నిందితుడు నరేష్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. హష్మీ ఇంటిపక్కన ఉంటున్న నరేష్ పథకం ప్రకారం డబ్బు కోసం హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. హష్మీని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి బండరాయితో తలపై గట్టిగా మోది, 600 రూపాయల నగదు, బంగారు గొలుసును తీసుకుని నరేష్ ఉడాయించాడు.

05/25/2016 - 17:57

హైదరాబాద్: నగరంలో పలుచోట్ల బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో వర్షం పడింది. మధ్యాహ్నం వరకూ భానుడి ప్రతాపంతో హడలెత్తిపోయిన జనం సాయంత్రానికి చిరుజల్లులు కురియడంతో ఒక్కసారి సేదతీరారు.

05/25/2016 - 16:52

హైదరాబాద్: వివిధ రంగాలకు సంబంధించి ప్రభుత్వ సలహాదారులుగా పనిచేస్తున్న విద్యాసాగర్‌రావు, గోయల్, రమణాచారి, పాపారావు, జిఆర్ రెడ్డి, రామ్‌లక్ష్మణ్ సేవలను తెలంగాణ సర్కారు మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

05/25/2016 - 15:20

హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లో అధిక ఫీజులకు నిరసనగా బుధవారం నగరంలోని స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఫీజుల విషయమై ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన జరిపారు.

05/25/2016 - 15:20

హైదరాబాద్: మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు జూలై 9న ఎంసెట్-2 నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం షెడ్యూల్‌ను ప్రకటించారు. మే 28న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. జూన్ 1 నుంచి 7 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. జూలై 9న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఎంట్రన్స్ నిర్వహిస్తారు. అదే రోజు ప్రాథమిక ‘కీ’ విడుదల చేసి, 14న ర్యాంకులను ప్రకటిస్తారు.

05/25/2016 - 15:19

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగానో ఉద్యమించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంపై కెసిఆర్ సర్కారు చిన్నచూపు చూస్తోందని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. పోరాటం చేసిన విద్యార్థులకు నేడు ఎలాంటి గుర్తింపు, గౌరవం లేకుండా పోయాయన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ట్యాంక్‌బండ్‌కు బదులు ఓయులో జరపాలన్నారు.

05/25/2016 - 12:15

నిజమాబాద్: పదో తరగతిలో మంచి మార్కులతో ప్యాసయిన పిల్లలను హైదరాబాద్‌లోని కళాశాలలో చేర్పిద్దామని తీసుకువెళ్తుండగా మృత్యువు కాటేసింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు, దంపతులు ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి వద్ద బుధవారం ఉదయం ఈ ఘోరం జరిగింది. ఆలూరుకు చెందిన హర్ష, వెల్మల్‌కు చెందిన నిఖిత, భరత్‌లతో పాటు వారి తల్లిదండ్రులు కారులో హైదరాబాద్‌కు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది.

05/25/2016 - 12:15

హైదరాబాద్: నగరంలో రెండు రోజుల క్రితం జాడ లేకుండా పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హష్మీ హత్యకు గురైనట్లు పోలీసులు కనుగొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన హష్మీ నగరంలోని టిసిఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం నుంచి ఇతను కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Pages