తెలంగాణ

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో రెండు రోజుల క్రితం జాడ లేకుండా పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హష్మీ హత్యకు గురైనట్లు పోలీసులు కనుగొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన హష్మీ నగరంలోని టిసిఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం నుంచి ఇతను కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వివిధ ప్రాంతాల్లో గాలించగా లింగంపల్లి రైల్వే ట్రాక్ వద్ద హష్మీ మృతదేహాన్ని గుర్తించారు. నగదు, సెల్‌ఫోన్, బంగారం కోసమే దుండగులు హష్మీని హత్య చేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఓ అనుమానితుణ్ణి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.