తెలంగాణ

పావలావడ్డీ కొనసాగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25 : రైతులకు చేయూత ఇచ్చేందుకు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూపొందించిన వడ్డీలేని రుణాలు, పావలావడ్డీపై రుణాల పథకం 2016-17 సంవత్సరంలో కూడా కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లక్ష రూపాయలలోపుగా పంట రుణాలు తీసుకునే రైతులు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా వారి తరపున ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది. అలాగే మూడు లక్షల రూపాయలోపు పంటల రుణాలు తీసుకునే రైతులు పావలావడ్డీమాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తం వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది. బ్యాంకుల నుండి 2012-13 నుండి ఇప్పటి వరకు రైతులు తీసుకున్న ఈ తరహా రుణాలకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. ఈ పథకాన్ని 2016-17 సంవత్సరానికి కొనసాగించేందుకు వీలుగా ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి పేరుతో జీఓ (జిఓ ఆర్‌టి నెంబర్ 236) జారీ అయింది.