తెలంగాణ

కార్మెల్, ఇండియానాలో కెటిఆర్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల, మున్సిపల్‌శాఖల మంత్రి కె తారకరామారావుతన రెండవ రోజు పర్యటనలో బుధవారం కార్మెల్, ఇండియానా పోలిస్ నగరాలను సందర్శించారు.ఈ సందర్భంగా కార్మెల్ నగర మేయర్ జెమ్స్ బ్రెనార్డ్‌తో మంఅతి కెటిఆర్ సమావేశమయ్యారు. అక్కడ జరుగుతున్న నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, ప్రజా రవాణా వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థల నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు. వౌలిక సదుపాయాల కల్పనలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన కార్యక్రమాలను మేయర్ జెమ్స్ మంత్రికి వివరించారు. తన నగరంలో ప్రజలు సకాలంలో పూర్తిగా చెల్లిస్తున్నట్టుగా కూడా వివరించారు. ఈ సందర్భంగా సిటీ హాల్‌ను కూడా మంత్రి సందర్శించి స్థానిక ప్రజా ప్రతినిధులు సమావేశంలో ప్రజల సమస్యలపై ఏవిధంగా ప్రస్తావిస్తారు, ఏ విధంగా భాగస్వామ్యం అవుతారో మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇండియానా పోలీస్ నగరంలోని ఐటీ కంపెనీలను, హెల్త్ కేర్ కంపెనీల పని తీరుపై కూడా మంత్రి కెటిఆర్ అడిగి తెలుసుకున్నారు. పౌర సేవలలో ఐటీని ఏ విధంగా వినియోగించుకుంటున్నారో మంత్రి ఆరా తీశారు.

అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం ఇండియానా పొలిస్ మేయర్
జేమ్స్ బ్రేనార్డ్‌కు జ్ఞాపికను అందజేస్తున్న తెలంగాణ మంత్రి కెటిఆర్