తెలంగాణ

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ గచ్చిబౌలి, మే 25: ఆంధ్రప్రదేశ్ సిపిఎం నేత మధు మేనల్లుడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హాష్మి దారుణ హత్యకు గురయ్యాడు. నగర శివారులోని లింగంపల్లి రైల్వే ట్రాక్ వద్ద పడివున్న మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా సెల్‌ఫోన్, నగదు, బంగారు గొలుసు కోసమే హాష్మిని హత్య చేసినట్టు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన వి హాష్మి (26) వారం క్రితమే టిసిఎస్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరారు. సికిందరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ గుడి సమీపంలో నివాసముంటున్న వల్లిపల్లి హాష్మి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. మంగళవారం ఉదయం అతను ఇంటికి చేరకపోవడంతో కుటుంబీకులు ఆరా తీశారు. కంపెనీలో వాకబు చేయగా ఇంటికి వెళ్లిపోయారని చెప్పారు. కాల్ చేస్తే సెల్‌ఫోన్ స్విచ్చ్ఫా చేసివుంది. హాష్మి కోసం గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో అతని సోదరుడు ఉమామహాశ్వర రావు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాష్మి కాల్ డేటా ఆధారంగా నరేష్‌కుమార్ అనే యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హాష్మి ఇంటి పక్కనే ఉండే నరేష్‌కుమార్ రెడ్డి రమ్మనడంతో హాష్మి వెళ్లాడని, స్నేహితుడే కావడంతో హాష్మి అతడి వెంట లింగంపల్లి వరకు వెళ్లాడని గచ్చిబౌలి సిఐ జె రమేశ్ తెలిపారు. తనకు ఓ పదివేలు డబ్బు అవసరముందని నరేశ్‌కుమార్ అడిగాడని, అయితే హాష్మి తన దగ్గర లేడని చెప్పడంతో అతడి వద్ద ఉన్న డబ్బులు లాక్కునే ప్రయత్నం చేశాడని, వారిద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో నరేశ్ ఓ బండరాయితో హాష్మి తలపై మోదాడని దీంతో హాష్మి అక్కడిక్కడే మృతి చెందినట్టు సిఐ పేర్కొన్నారు. హాష్మి మృతి చెందినట్టు నిర్ధారించుకున్న నరేశ్‌కుమార్ హాష్మి వద్దనున్న పర్సు, సెల్‌ఫోన్, బంగారు గొలుసు తీసుకొని పారిపోయాడు. మర్నాడు ఏమీ తెలియనట్టు హాష్మి బైక్ తిరిగి ఇచ్చేయడానికి వచ్చాడు. కాల్ డేటా ఆధారంగా నరేశ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు సిఐ రమేశ్ తెలిపారు.

నిందితుడు నరేష్‌కుమార్‌రెడ్డి

హష్మి