తెలంగాణ

బయటపడ్డారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 25: గత మూడేళ్లుగా గుంపు మేస్ర్తీ చెరలో నరకాన్ని చవి చూసిన పాలమూరు కూలీలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. కాంట్రాక్టర్ నిర్బంధం నుంచి తప్పించుకున్న కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డొంకంతా కదిలింది. మూడేళ్ల పాటు ఆడ, మగా, గర్భిణులన్న తేడా లేకుండా రాక్షసంగా ప్రవర్తించిన గుంపు మేస్ర్తీ కూడా అరెస్టయ్యాడు. గత మూడు నాలుగేళ్లుగా తీవ్రమైన కరువు మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలను పట్టిపీడిస్తోంది. ఫలితంగా ఉపాధి కరువైన ప్రజలు కూలీలుగా మారుతున్నారు. పదుల ఎకరాల భూమి ఉన్న రైతు సైతం వలసకూలీగా మారి ఇతర రాష్ట్రాల్లో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. కరువు పరిస్థితులను ఆసరాగా తీసుకున్న గుంపు మేస్ర్తిలు పాలమూరు జిల్లాపై కనె్నశారు. అందులో భాగంగా గత మూడేళ్ల నుండి జిల్లాలో వలసల పర్వం జోరందుకుంది. అయితే మూడేళ్ల క్రితం గుంపు మేస్ర్తి అంజనేయులు మహబూబ్‌నగర్ జిల్లాలోని లింగాల మండలంలో పలు గ్రామాలకు చెందిన చెంచులను రాజస్థాన్‌కు కూలీ పనులను నిమిత్తం తరలించాడు. వీరికి వేల రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చినట్టు వారితో ప్రామిసరీ నోట్లపై సంతకాలు కూడా తీసుకున్నాడు. దాదాపు 55 మంది కూలీలను మూడేళ్ల క్రితం రాజస్థాన్‌లో రోడ్డు పనుల కోసమని గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లారు. ఒక నెల మాత్రమే స్వేచ్చగా ఉన్నట్లు నమ్మించి రానురాను కూలీలందరిని తన నిర్భదంలో ఉంచుకున్నాడు. రెండేళ్ల పాటు నిర్భదంలోనే కాలం గడుపుతూ ప్రతినిత్యం వేధింపులకు గురైన తమకు విముక్తి లభించడంతో ఆ రైతుల ఆనందానికి అవధులే లేవు.
వారం రోజుల క్రితం ఒకరిద్దరు కూలీలు గుట్టుచప్పుడు కాకుండా నిర్భదం నుండి బయటపడి ఎలాగోలాగా రాష్ట్రానికి చేరుకుని జరిగిన విషయాన్ని తమ బంధువులకు చెప్పడంతో అసలు గుట్టు రట్టయింది. తమకు ఫిర్యాదు అందడంతో సిఐడి పోలీసులు రంగంలోకి దిగారు. గుంపుమేస్ర్తి అంజనేయులు కదలికపై ఆరా తీశారు. ఈ విషయం అంజనేయులుకు తెలియడంతో కూలీలను గుట్టుచప్పుడు కాకుండా ఓ లారీలో కర్ణాటకకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ లారీని బిజాపూర్ దగ్గర మంగళవారం రాత్రి పోలీసులు అడ్డుకున్నారు. అందులోని కూలీలకు విముక్తి కలిగించి వారిని బుధవారం ఉదయం మహబూబ్‌నగర్‌కు తరలించారు. వెంటనే జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవికి సమాచారం ఇచ్చారు. కలెక్టర్ టికె శ్రీదేవితో పాటు, మహబూబ్‌నగర్ డి ఎస్పీ కృష్ణమూర్తి కూలీల వద్దకు చేరుకుని జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. భార్యా భర్తలు మాట్లాడుకోవాలన్నా కూడా గుంపు మేస్ర్తీ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేదని కూలీలు తెలిపారు. వీరిలో ఉన్న కొందరు గర్భిణీలు తాము ఆనుభవించిన నరకాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కలెక్టర్ కూడా వారి ఆవేదనకు చలించిపోయారు. తాము గర్భిణీలమని కూడా చూడకుండా తమను గుంపు మేస్ర్తీ, కాంక్రాక్టర్లు నరయాతన పెట్టారని వారు తెలిపారు. తమ సమీప బంధువులు చనిపోయినట్టు తెలిసినా కూడా తమను వెళ్లనివ్వలేదని మరి కొందరు తమ బాధను వెళ్లగక్కారు. కూలీలంతా లింగాల మండలం ఎర్రపెంట, చెన్నంపల్లి, శ్రీరంగాపురం, వడ్డెరరాఘవపురం, చెంచుమాలచింతలపల్లిలకు చెందిన వారు కావడంతో వీరికి సంబంధించిన సమాచారాన్ని కలెక్టర్ టికె శ్రీదేవి నాగర్‌కర్నూల్ ఆర్డి ఓ దేవేందర్‌రెడ్డికి తెలిపారు. వీరికి పునరావాసం కల్పించాలని, అలాగే గ్రామాల్లోనే రోజుకు రూ.190 కూలీ పడేలా ఉపాధి కల్పించాలని ఆదేశించారు. అలాగే, మూడు రోజుల పాటు మహబూబ్‌నగర్‌లోనే కూలీలు ఉంటారని, వారందరికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. గుంపుమేస్ర్తిని పోలీసులు ఆరెస్టు చేశారని కలెక్టర్ ప్రకటించారు.
chitram...
మహబూబ్‌నగర్‌లో కూలీలతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి