తెలంగాణ

ప్రైవేటు స్కూళ్లలో ఫీజులపై తల్లిదండ్రుల ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో స్కూల్ ఫీజులను తగ్గించాలనే డిమాండ్‌తో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఎన్‌జిఓల ప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడి కార్యాలయం వద్ద బుధవారం నాడు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఒక దశలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఐకాస ప్రతినిధులు అరవింద, నారాయణ, ప్రకాష్, సీమా తదితరులతో డైరెక్టర్ జి కిషన్ చర్చలు జరిపారు. ప్రైవేటు యాజమాన్యాలు చేస్తున్న ఒత్తిడి, బెదిరింపులను ఐకాస ప్రతినిధులు వివరించారు. అందుకు సానుకూలంగా స్పందించిన డైరెక్టర్ ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.
ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకుంటే జూన్ 11న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తామని స్కూల్ ఫీజుల నియంత్రణ ఐక్య కార్యాచరణ సమితి చైర్‌పర్సన్ అరవింద్ జాటా, ప్రధానకార్యదర్శి నాగాటి నారాయణ చెప్పారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు సంబంధించిన జీవో 1/1994, జీవో 91/2008లను అమలుచేయాలని వారు కోరారు. ఫీజుల నియంత్రణ నిబంధనలు అమలుచేస్తూ తాజాగా ప్రభుత్వం మరోమారు ఉత్తర్వులు ఇవ్వాలని వారు కోరారు. విద్యాసంవత్సరం ముగిసి మరల విద్యాసంవత్సరం మొదలైనా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, ప్రైవేటు స్కూళ్లు షరా మామూలుగా 300 శాతానికి పైగానే ఫీజులను పెంచి వసూలుచేస్తున్నాయని వారు పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆవేదనను ప్రభుత్వంకాని, యాజమాన్యాలు కాని పట్టించుకోవడం లేదని చెప్పారు. ఉచితంగా పొందాల్సిన విద్య అత్యంత ఖరీదైన అంగడి సరకుగా అందలమెక్కుతోందని వారు పేర్కొన్నారు. అనంతరం వారు పాఠశాల విద్యా శాఖ సంచాలకుడి కార్యాలయంలో ఒక వినతి పత్రం అందజేశారు.

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడి కార్యాలయం వద్ద
బుధవారం నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు