S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/10/2015 - 06:16

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ఈ శతాబ్దంలోనే అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్న రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ మధ్య మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్నెషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపిటిఎల్)లో భాగంగా న్యూఢిల్లీలో వీరిద్దరి మధ్య పోరు ఉంటుంది. ఈ టోర్నమెంట్‌లో పలువురు మేటి టెన్నిస్ స్టార్లు ఆడుతున్నారు.

12/10/2015 - 06:15

హోబర్ట్, డిసెంబర్ 9: వెస్టిండీస్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అన్నాడు. విండీస్‌పై 3-0 తేడాతో గెలుపొంది, క్లీన్‌స్వీప్ సాధించడమే తమ లక్ష్యమని అన్నాడు. నాథన్ కౌల్టర్ నైల్‌ను కాదని జేమ్స్ పాటిన్సన్‌కు తుది జట్టులో అవకాశం కల్పించడాన్ని అతను సమర్థించుకున్నాడు.

12/10/2015 - 06:14

లండన్, డిసెంబర్ 9: గత నెల 28న జరిగిన టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ వ్లాదిమీర్ క్లిచ్కోను ఓడించిన బ్రిటిష్ హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్ టైసన్ ఫ్యూరీ తనకు లభించిన బెల్ట్స్‌లో ఒకదానిని కోల్పోనున్నాడు. క్లిచ్కోపై సంచలన విజయాన్ని నమోదు చేసిన అతనికి డబ్ల్యుబిఎ, ఐబిఎప్, ఐబిఓ, డబ్ల్యుబివో బెల్ట్‌లు లభించాయి.

12/09/2015 - 06:14

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో తాత్కాలిక జట్లుగా పుణె, రాజ్‌కోట్ అడుగుపెట్టబోతున్నాయి. వచ్చే రెండేళ్లు ఈ రెండు జట్లు ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడతాయి. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీ రెండేళ్లపాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

12/09/2015 - 06:11

రాంచీ, డిసెంబర్ 8: టి-20, వనే్డ ఫార్మెట్స్‌లో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఈనెల 10 నుంచి 18వ తేదీ వరకూ జరిగే విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో వరుణ్ ఆరోన్ కెప్టెన్సీలో మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జార్ఖండ్ జట్టులో ధోనీని చేర్చారు.

12/09/2015 - 06:11

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: సహజంగా బిడ్స్‌లో ఎక్కువ మొత్తాన్ని కోట్ చేసిన వారికే కాంట్రాక్టు లభిస్తుంది. అయితే, రివర్స్ బిడ్ విధానం దీనికి భిన్నంగా ఉంటుంది. ముందుగానే బిడ్స్‌కు గరిష్ట పరిమితిని నిర్ణయిస్తారు. కాంట్రాక్టు కోరుకునే వారంతా అంతకు మించకుండా మొత్తాలను కోట్ చేయాల్సి ఉంటుంది. తక్కువ మొత్తం కోట్ చేసిన వారికే కాంట్రాక్టు దక్కుతుంది.

12/09/2015 - 06:10

లండన్, డిసెంబర్ 8: పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడడం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉందని, తప్పకుండా ఆడి తీరాలన్న నిబంధన ఏదీ లేదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జెఫ్ బాయ్‌కాట్ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయ వనరులున్న క్రికెట్ బోర్డుగా ఎదిగింది కాబట్టి బిసిసిఐ చెప్పిందే ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో శాసనమవుతుందని వ్యాఖ్యానించాడు.

12/09/2015 - 06:09

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జరుగుతుందా? లేదా? అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతున్నది. శ్రీలంకలో సిరీస్ ఆడాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఇటీవల నిర్ణయించాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ప్రతిపాదన పంపిన వెంటనే నవాజ్ షరీఫ్ సర్కారు ఆమోద ముద్ర వేసింది. దీనితో ఇప్పుడు బంతి భారత్ కోర్టులో ఉంది.

12/09/2015 - 06:07

దుబాయ్, డిసెంబర్ 8: ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (డబ్ల్యుబిఎఫ్) ప్రతి సంవత్సరం ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే అవార్డు మహిళల విభాగంలో కరోలినా మారిన్‌కు దక్కింది. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తీవ్రంగా పోటీపడినప్పటికీ, అవార్డును మారిన్ ఎగరేసుకుపోయంది. ఈ ఏడాది సైనా నెహ్వాల్ నిలకడగా రాణించడంతో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కొంత కాలం అగ్రస్థానంలో నిలువడంతో ఆమె ఈ అవార్డుకు నామినేట్ అయింది.

12/09/2015 - 06:06

లండన్, డిసెంబర్ 8: లండన్ చెస్ క్లాసిక్ టోర్నీ నాలుగో రౌండ్‌లో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు చుక్కెదురైంది. ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అతను నాలుగోరౌండ్‌లో అమెరికా ఆటగాడు హిరాకు నాకమూరతో తలపడి ఓటమిపాలయ్యాడు. గేమ్ ఆరంభం నుంచి చివరి వరకూ అతను ఏ దశలోనూ సమర్థంగా బలగాలను ముందుకు కదలపలేయాడు. ప్రత్యర్థి ఎత్తులను తిప్పికొట్టలేక పరాజయాన్ని చవిచూశాడు.

Pages