S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/06/2015 - 05:15

పుణె, డిసెంబర్ 5: జెజే లాల్‌పెహ్లువా చేసిన కీలక గోల్ సాయంతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో చెనె్నయిన్ జట్టు సెమీ ఫైనల్స్‌లో స్థానం సంపాదించింది. పుణె సిటీతో శనివారం జరిగిన మ్యాచ్‌ని ఈ జట్టు 1-0 తేడాతో గెల్చుకుంది. టోర్నమెంట్‌లో ఎక్కువ శాతం మ్యాచ్‌ల్లో మాదిరిగానే శనివారం కూడా ఇరు జట్లు మితిమీరిన డిఫెన్స్‌తో ప్రేక్షకులను నిరాశ పరిచారు.

12/06/2015 - 05:15

బ్రిస్బేన్, డిసెంబర్ 5: క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ఎలెవెన్‌తో జరిగిన నాలుగు రోజుల టూర్ మ్యాచ్‌లో వెస్టిండీస్ పది వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. రెండు ఇన్నింగ్స్‌లో కేవలం పది పరుగుల విజయ లక్ష్యాన్ని సిఎ ఎలెవెన్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 90.5 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది.

12/06/2015 - 05:14

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: చివరి వరకూ అత్యంత నాటకీయ మలుపులు తిరిగిన కార్యక్రమం చివరికి రద్దయింది. మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ తోపాటు 1983, 2011 సంవత్సరాల్లో ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న భారత జట్లలోని ఢిల్లీ ఆటగాళ్లను ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శనివారం సన్మానించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.

12/06/2015 - 05:14

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు మూడో రోజు ఆటలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అసహనానికి గురయ్యాడు. ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇమ్రాన్ తాహిర్ వేసిన బంతి కోహ్లీ బ్యాట్‌ను తగులుతూ వికెట్‌కీపర్ విలాస్ చేతిలోకి వెళ్లింది. అవుటయ్యాడని తాహిర్ అప్పీల్ చేయడం పట్ల కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు.

12/06/2015 - 05:13

చెన్నైకి సహాయసహకారాలు అందిస్తాం
*భారత క్రికెటర్లు అశ్విన్, మురళీ విజయ్

12/06/2015 - 05:12

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: పొట్టి ఫార్మెట్స్‌కే తప్ప టెస్టు క్రికెట్‌కు పనికిరాడని ముద్ర వేయించుకున్న రోహిత్ శర్మ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో అతనికి స్థానం దక్కలేదు.

12/06/2015 - 05:09

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: భారత్ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలించడం కొత్త విషయమేమీ కాదని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పిచ్‌లపై చెలరేగుతున్న విమర్శలపై ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను స్పందిస్తూ, భారత దేశంలో మొదటి నుంచి స్పిన్నర్ల ఆధిపత్యం ఉందని అన్నాడు. అందుకే ఇక్కడి పిచ్‌లు వారికి అనుకూలంగానే ఉంటాయని పేర్కొన్నాడు.

12/06/2015 - 05:09

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: ఫిరోజ్ షా కోట్లా మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి, నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లకు 190 పరుగులు చేసిన టీమిండియా మ్యాచ్‌పై పట్టు బిగించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 334 పరుగులకు సమాధానంగా మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన దక్షిణాఫ్రికా 121 పరుగులకే ఆలౌట్‌కాగా, రెండో రోజు ఆటను అక్కడే ముగిస్తున్నట్టు అంపైర్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

12/05/2015 - 06:21

హైదరాబాద్, డిసెంబర్ 4: ఎడతెరిపిలేని భారీ వర్షాలతో తల్లడిల్లుతున్న తమిళనాడులో వరద బాధితులను ఆదుకునేందుకు భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ 2 లక్షల రూపాయల విరాళాన్ని ఇవ్వనుంది. ఆమె తండ్రి హర్‌వీర్ సింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

12/05/2015 - 06:21

* నిష్క్రమించిన సింధు

Pages