S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/01/2015 - 06:19

మాడ్రిడ్, నవంబర్ 30: స్పానిష్ సాకర్ లీగ్ లా లిగాలో రియల్ మాడ్రిడ్ జట్టు మళ్లీ రేసులోకి వచ్చింది. గత వారం బార్సిలోనాతో జరిగిన మ్యాచ్‌లో 0-4 తేడాతో పరాజయాన్ని ఎదుర్కోవడంతో రియల్ మాడ్రిడ్ పాయింట్ల పట్టిలో మెరుగైన స్థానాన్ని అందుకునే అవకాశాలపై అనుమానాలు తలెత్తాయి. అయితే, ఎబార్‌తో జరిగిన మ్యాచ్‌ని 2-0 తేడాతో గెల్చుకోవడంతో ఈ జట్టు మూడో స్థానానికి దూసుకెళ్లింది.

12/01/2015 - 06:18

టెస్టు మ్యాచ్ నిర్వహణపై ముకుల్ ముద్గల్ వ్యాఖ్య

12/01/2015 - 06:40

ఇండోనేషియా ఓపెన్‌కు సిద్ధమైన షట్లర్ సింధు

11/30/2015 - 06:45

మకావూ, నవంబర్ 29: భారత స్టార్ షట్లర్, హైదరాబాదీ పివి సింధు మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్‌ను వరుసగా మూడోసారి కైవసం చేసుకొని హ్యాట్రిక్ నమోదు చేసింది. రెండు వరుస టైటిళ్లతో ఫేవరిట్‌గా బరిలోకి దిగిన సింధు ఆదివారం జరిగిన మహిళల ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి మినాత్సు మితానీపై 21-9, 21-23, 21-14 తేడాతో గెలిచింది.

11/30/2015 - 06:43

కోల్‌కతా, నవంబర్ 29: ముంబయికి చెందిన సర్ఫ్‌రాజ్ ఖాన్ మెరుపు బ్యాటింగ్ ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన అండర్-19 ట్రై సిరీస్ ఫైనల్‌లో భారత్‌కు ఏడు వికెట్ల భారీ తేడాతో విజయాన్ని అందించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 36.5 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. నజ్ముల్ హొస్సేన్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగతా బ్యాట్స్‌మెన్ ఒకరి తర్వాత మరొకరిగా పెవిలియన్‌కు క్యూ కట్టారు.

11/30/2015 - 06:40

అడెలైడ్, నవంబర్ 29: క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను దక్కించుకున్న ఆస్ట్రేలియా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 138 సంవత్సరాల టెస్టు క్రికెట్ చరిత్రలో మొదటిసారి జరిగిన డే/నైట్ మ్యాచ్‌ని మూడు వికెట్ల తేడాతో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు ఆలౌట్ చేసిన ఆసీస్ తర్వాత 187 పరుగుల లక్ష్యాన్ని 51 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి అందుకుంది.

11/30/2015 - 06:38

మాడ్రిడ్, నవంబర్ 29: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో బ్రెజిల్ స్టార్ ఆటగాడు నేమార్‌కు ఎందుకు విపరీతమైన క్రేజ్ ఉందో చెప్పడానికి స్పానిష్ సాకర్ లీగ్ లా లిగాలో రియల్ సోసిడాడ్‌తో జరిగిన మ్యాచ్ స్పష్టం చేసింది. రెండు గోల్స్ సాధించిన అతను బార్సిలోనా 4-0 తేడాతో తిరుగులేని విజయాన్ని సాధించడంలో కీలక భూమిక పోషించాడు. మ్యాచ్ 22వ నిమిషంలో అతను కొట్టిన ఫ్లయింగ్ కిక్ అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

11/30/2015 - 06:38

న్యూఢిల్లీ, నవంబర్ 29: ఇథియోపియాకు చెందిన బిర్హాను లెగెసె, కెన్యా అథ్లెట్ సింథియా లిమో ఆదివారం ఇక్కడ జరిగిన ఢిల్లీ హాఫ్ మారథాన్ రన్ టైటిళ్లు కైవసం చేసుకున్నారు. పురుషుల విభాగంలో లెగెసె తన సహచరుడు మోసినెట్ జెరెమీ కంటే 25 సెకన్లు ముందుగా లక్ష్యాన్ని చేరుకొని విజేతగా నిలిచాడు. తడెసె ఎరీకి మూడో స్థానం దక్కింది. మహిళల విభాగంలో కెన్యా క్లీన్ స్వీప్ చేసింది.

11/30/2015 - 06:37

బెర్లిన్, నవంబర్ 29: ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్‌లో కొత్త చాంపియన్ అవతరించాడు. 11 సంవత్సరాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న వ్లాదిమీర్ క్లిచ్కో దూకుడుకు అడ్డుకట్ట వేసిన 27 ఏళ్ల టైసన్ ఫ్యూరీ ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు.

11/30/2015 - 06:36

కొచ్చి, నవంబర్ 29: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఆదివారం ప టిష్టమైన గోవా ఫుట్‌బాల్ క్లబ్‌ను ఢీకొన్న కేరళ బ్లా స్టర్స్ చిత్తయంది. 5-1 తేడాతో ఈ మ్యాచ్‌ని కైవసం చేసుకున్న గోవా పాయంట్ల పట్టికలో రెండో స్థానికి చేరింది. డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో కోల్‌కతా 23 పాయంట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించగా గోవా ఖాతాలో ఇప్పుడు 22 పాయంట్లు ఉన్నాయ.

Pages