S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/07/2015 - 07:01

మలాంగ్, డిసెంబర్ 6: టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఇండోనేషియా మాస్టిర్స్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్‌లో పరాజయాన్ని ఎదుర్కొని, రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందాడు. స్థానిక ఆటగాడు టామీ సుగియార్తోతో పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో తలపడిన శ్రీకాంత్ గట్టిపోటీనిచ్చాడు.

12/07/2015 - 07:01

రాయ్‌పూర్, డిసెంబర్ 6: అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న హాకీ వరల్డ్ లీగ్ (హెడ్‌డబ్ల్యుఎల్) ఫైనల్ టోర్నమెంట్‌లో భారత జట్టుకు కాంస్య పతకం లభించింది. క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో పటిష్టమైన నెదర్లాండ్స్‌తో హోరాహోరీగా పోరు సాగింది. గోల్స్ వరద పారింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు సమవుజ్జీగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యపైంది.

12/07/2015 - 06:58

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచ్ లో గోవా సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌ను ఢీకొన్న ఢిల్లీ డైనమోస్ జట్టు 2-3 తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ 31వ నిమిషంలో సెర్గియన్హో గ్రీన్, 40వ నిమిషంలో అదిల్ నబీ ఢిల్లీకి గోల్స్ అందించారు. దీనితో 2-0 ఆధిక్యా న్ని సంపాదించిన ఆ జట్టు దాడులకు స్వస్తి చెప్పి, రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది.

12/07/2015 - 06:58

రాయ్‌పూర్, డిసెంబర్ 6: హాకీ వరల్డ్ లీగ్ (హెడ్‌డబ్ల్యుఎల్) ఫైనల్ టైటిల్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసు కుంది. బెల్జియంతో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో ఈ జట్టు 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించిం ది. మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆధిపత్యాన్ని కొనసాగించడమే లక్ష్యంగా ఎంచుకున్నారు.

12/07/2015 - 06:58

మొదటి వంద బంతుల్లో ఆరు పరుగులు

12/07/2015 - 06:57

భారత్ 5/267 డిక్లేర్
దక్షిణాఫ్రికా లక్ష్యం 481
ప్రస్తుత స్కోరు 2/72
చేయాల్సిన పరుగులు 409

12/06/2015 - 05:17

ఎఐబిఎ ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్

12/06/2015 - 05:17

రాయ్‌పూర్, డిసెంబర్ 5: హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ (హెచ్‌డబ్ల్యుఎల్) టోర్నమెంట్ టైటిల్ రేస్ నుంచి భారత్ నిష్క్రమించింది. శనివారం జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో ఈ జట్టు 0-1 తేడాతో బెల్జియం చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. దీనితో ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయిన సర్దార్ సింగ్ నేతృత్వంలోని భారత్ ఇక క్లాసిఫికేషన్ మ్యాచ్‌ల్లో పోటీపడుతుంది.

12/06/2015 - 05:16

మలాంగ్, డిసెంబర్ 5: భారత స్టార్, తెలుగు వీరుడు కిడాంబి శ్రీకాంత్ ఇక్కడ జరుగుతున్న ఇండోనేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీ ఫైనల్‌లో అతను గింటింగ్ ఆంథోనీపై 21-13, 21-19 తేడాతో విజయం సాధించాడు. ఈ మ్యాచ్ కేవలం 37 నిమిషాల్లోనే పూర్తి కావడం గమనార్హం.

12/06/2015 - 05:15

లండన్, డిసెంబర్ 5: ఇక్కడ ఆరంభమై న లండన్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్‌ను భార త గ్రాండ్ మాస్టర్, ప్రపంచ మాజీ చాంపి యన్ విశ్వనాథన్ ఆనంద్ డ్రాతో మొదలు పెట్టాడు. ఇంగ్లాండ్‌కు చెందిన మైఖేల్ ఆడ మ్స్‌తో తలపడిన అతను దూకుడుగా ఆడ కుండా డ్రా చేసుకోవడమే లక్ష్యంగా పావు లను ముందుకు కదిపాడు. అతను ఊహిం చిన విధంగానే గేమ్ డ్రా అయంది.

Pages