S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/13/2015 - 04:28

శ్రీలంకతో మొదటి టెస్టు
డ్యునెడిన్, డిసెంబర్ 12: శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టుపై న్యూజిలాండ్ పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 431 పరుగుల భారీ స్కోరు చేసిన ఈ జట్టు ఆతర్వాత శ్రీలంకను 294 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను
ఆరంభించి, ఆట ముగిసే సమయానికి 48 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 171
పరుగులు సాధించింది. మ్యాచ్ మూడోరోజు, శనివారం

12/13/2015 - 04:28

15న ఐపిఎల్ క్రీడాకారులకు డ్రాఫ్ట్

12/13/2015 - 04:27

హోబర్ట్, డిసెంబర్ 12: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌ని మూడో రోజునే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 212 పరుగుల భారీ తేడాతో సొంతం చేసుకుంది. చాలాకాలం తర్వాత మళ్లీ టెస్టు జట్టులో స్థానం సంపాదించిన జేమ్స్ పాటిన్సన్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ విజయభేరి మోగించింది. ఏ దశలోనూ గట్టిపోటీని ఇవ్వలేకపోయిన విండీస్ ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోలేకపోయింది.

12/12/2015 - 06:53

ముంబయి, డిసెంబర్ 11: వచ్చే ఏడాది జరిగే ఐసిసి ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్‌లకు ఒకే గ్రూపులో చోటు లభించింది. చాలా కాలం నుంచి పరస్పర పోటీకి దూరంగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య మార్చి 19వ తేదీన ధర్మశాలలో హై-ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. మార్చి 8వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్ షెడ్యూల్‌ను ఐసిసి శుక్రవారం ఆవిష్కరించింది.

12/12/2015 - 06:49

డునెడిన్, డిసెంబర్ 11: న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా డునెడిన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక జట్టు కష్టాలకు ఎదురీదుతోంది. 8 వికెట్ల నష్టానికి 409 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు మరో 22 పరుగులు సాధించి ఆలౌట్ అయింది.

12/12/2015 - 06:48

కరాచీ, డిసెంబర్ 11: ప్రతిపాదిత భారత్-పాక్ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ గనుక వచ్చే నెల లోపల జరగనట్లయితే మరో ఏడాది దాకా జరిగే అవకాశం లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పిసిబి) చైర్మన్ షహర్యార్ ఖాన్ అన్నాడు. ‘ఇప్పుడు గనుక ఈ సిరీస్ జరక్క పోతే మరో ఏడాది దాకా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే వచ్చే ఏడాది అంతా రెండు జట్లకు ముందే నిర్ణయించిన షెడ్యూల్ ఉంది’ అని ఆయన అన్నాడు.

12/12/2015 - 06:47

దుబాయ్, డిసెంబర్ 11: ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) ఆధ్వర్యాన దుబాయ్‌లో జరుగుతున్న సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో భారత్ పోరు ముగిసిపోయింది. శుక్రవారం జరిగిన మహిళల, పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లలో సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లు ఇద్దరూ ఓటమి పాలయ్యారు.

12/12/2015 - 06:46

హోబర్ట్, డిసెంబర్ 11: వెస్టిండీస్‌తో మూడు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా హోబర్ట్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్లు ఆడమ్ వోగ్స్ (269-నాటౌట్), షాన్ మార్ష్ (182) సెంచరీలతో విజృంభించి నాలుగో వికెట్‌కు 449 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

12/12/2015 - 06:45

ముంబయి, డిసెంబర్ 11: ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు సైతం ప్రశాంతంగా ఉండడం ఒక్క ధోనీకే చెల్లిందని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోష్లీ ప్రశంసిస్తూ, అన్ని సమయంలోను సంయమనం కోల్పోకుండా ఉండే ఈ కళను అతనినుంచి నేర్చుకోవడానికి ఎదురు చూస్తున్నానని అన్నాడు. ‘కెప్టెన్సీకి సంబంధించినంతవరకు అతను ఒక రికార్డు సృష్టించాడు. సాద్యమైనవన్నీ అతను సాధించాడు.

12/12/2015 - 06:44

టోక్యో, డిసెంబర్ 11: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా)లో చోటు చేసుకున్న పది కోట్ల డాలర్ల లంచాల కుంభకోణం కేసు ముగిసిపోయినట్లేనని, ఈ వ్యవహారంతో సంబంధం ఉందన్న ఆరోపణ కారణంగా ఫిఫా అధ్యక్ష పదవినుంచి సస్పెండయిన సెప్ బ్లాటర్ శుక్రవారం అన్నాడు. అంతేకాక ఫిఫాలోని ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడిన విషయం తనకు తెలియదని కూడా ఆయన వాదించాడు.

Pages