S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/14/2015 - 07:54

డ్యునెడిన్, డిసెంబర్ 13: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో ఓటమి అంచున నిలిచిన శ్రీలంకకు మ్యాచ్ నాలుగో రోజు, ఆదివారం తాత్కాలిక ఊరట లభించింది. వర్షం కారణంగా ఆటను ముందుగానే నిలిపివేయాల్సి రావడంతో, వికెట్ల పతనాన్ని వాయిదా వేసుకోగలిగింది. చివరి రోజైన సోమవారం కూడా వర్షం కురిస్తే, ఓటమి ప్రమాదం నుంచి లంక బయటపడుతుంది.

12/14/2015 - 07:53

ఆలూర్ (కర్నాటక), డిసెంబర్ 13: విజయ్ హజారే క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ గ్రూప్ ‘బి’లో జరిగిన మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్‌పై హర్యానా పది వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. అక్షర్ పటేల్ కేవలం 21 పరుగులకే ఐదు వికెట్లు సాధించడమేగాక, బ్యాటింగ్‌లోనూ రాణించి 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

12/14/2015 - 07:52

మెల్బోర్న్, డిసెంబర్ 13: డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను స్టాండ్‌బై కెప్టెన్‌గా క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అధికారులు ప్రకటించారు. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ గాయంతో బాధపడుతున్న నేపథ్యంలో, వచ్చేనెల 12 నుంచి భారత్‌తో స్వదేశంలో ఆరంభం కానున్న వనే్డ సిరీస్‌లో జట్టును వార్నర్ నాయకత్వం వహించే అవకాశాలున్నాయి.

12/14/2015 - 07:51

కరాచీ, డిసెంబర్ 13: భారత్‌లో వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే టి-20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొనాలని మాజీ కెప్టెన్ వసీం అక్రం పిలుపునిచ్చాడు. ద్వైపాక్షిక సిరీస్‌పై భారత్ ఇంకా స్పష్టత ఇవ్వలేదన్న కారణంగా టి-20 వరల్డ్ కప్ నుంచి వైదొలిగే ఆలోచన చేయకూడదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారులకు సూచించాడు.

12/13/2015 - 05:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: రోహన్ బొపన్నతో స్నేహం, ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ఉన్న నమ్మకం, అవగాహనకు టెన్నిస్‌తో సంబంధం లేదని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వ్యాఖ్యానించింది. వచ్చే ఏడాది మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా, బొపన్న కలిసి బరిలోకి దిగుతారన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. రియో ఒలింపిక్స్‌లో వీరి జోడీ పోటీపడుతుందని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, సానియా ఈ విషయాన్ని వ్యతిరేకించలేదు.

12/13/2015 - 04:32

పారిస్, డిసెంబర్ 12: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) నుంచి సస్పెన్షన్‌కు గురైన యూఫా ఫుట్‌బాల్ అధ్యక్షుడు మైఖేల్ ప్లాటినీకి కష్టాలు తప్పేటట్టు కనిపించడం లేదు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైందని, సస్పెన్షన్‌ను దీర్ఘకాలం కొనసాగించే అవకాశాలున్నాయని ఫిఫా వర్గాలు అంటున్నాయి.

12/13/2015 - 04:30

ముంబయి, డిసెంబర్ 12: రాజ్‌కోట్ స్థానిక ఆటగాడు రవీంద్ర జడేజాకే ఇంటెక్స్ ఓటు వేయడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. చాలాకాలం తర్వాత మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చిన జడేజా చక్కటి ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఉత్తమ బౌలింగ్ ప్రదర్శనతో ప్రశంసలు అందుకున్నాడు. పైగా స్థానికుడు కావడంతో అతనికే రాజ్‌కోట్ తొలి అవకాశం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తున్నది.

12/13/2015 - 04:30

లండన్, డిసెంబర్ 12: భారత గ్రాండ్ మాస్టర్, మాజీ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఇక్కడ జరుగుతున్న లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్‌లో మూడో పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. మాక్సిమ్ వచియా లాగ్రేవ్ (ఫ్రాన్స్)ను ఢీకొన్న అతను తన బలగాలను సక్రమంగా కదిలించలేకపోయాడు. ప్రత్యర్థి వ్యూహాత్మకంగా విరుచుకుపడగా, కనీసం రక్షణాత్మకంగా కూడా ఎత్తులు వేయలేక ఓటమిని కొనితెచ్చుకున్నాడు.

12/13/2015 - 04:30

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: భారత డిస్కస్ డ్రోయర్ వికాస్ గౌడకు వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత లభించింది. వాస్తవానికి డిస్కస్‌ను 66 మీటర్ల దూరం విసిరిన వారికే ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని నిర్వాహణ కమిటీ తొలుత ప్రకటించింది. అయితే, ఇటీవల ఆ నిబంధనను మార్చి, 65 మీటర్లకు ఖరారు చేసింది.

12/13/2015 - 04:29

ముంబయి, డిసెంబర్ 12: వచ్చే ఏడాది మార్చి 11 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు మన దేశంలో జరిగే టి-20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీ ప్రపంచ యాత్ర ఆదివారం ప్రారంభమవుతుంది. ఈ ట్రోఫీని ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరిగే దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రదర్శనకు ఉంచుతామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

Pages