S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/17/2015 - 06:00

మెల్బోర్న్, డిసెంబర్ 16: వచ్చే ఏడాది జరిగే ప్రపంచ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టుకు భారత మాజీ క్రికెటర్ శ్రీ్ధరన్ శ్రీరామ్ సలహాదారుగా వ్యవహరించనున్నాడు. ఆసీస్ మాజీ బ్యాట్స్‌మన్ మైక్ హస్సీతో కలిసి అతను సలహాదారుగా వ్యవహరిస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ఒక ప్రకటనలో తెలిపింది.

12/17/2015 - 05:59

కోల్‌కతా, డిసెంబర్ 16: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో చెనె్నయన్ అత్యంత నాటకీయంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. లెమెస్సా ఫిక్రూ కీలకమైన గోల్‌చేసి చెనె్నయన్‌ను పైనల్ చేర్చాడు. బుధవారం జరిగిన రెండో సెమీ ఫైనల్ సెకండ్ లెగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతాను ఢీకొన్న ఈ జట్టు 1-2 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది.

12/17/2015 - 05:59

మెల్బోర్న్, డిసెంబర్ 16: ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ఎంపిక చేసిన భారత అత్యుత్తమ టెస్టు జట్టులో సచిన్ తెండూల్కర్‌కు స్థానం లభించింది. మొత్తం 11 మంది భారత క్రికెటర్ల పేర్లను పేర్కొన్న వార్న్ 12వ ఆటగాడిగా వివిఎస్ లక్ష్మణ్ పేరును ఖాయం చేశాడు. సచిన్‌కు ఎలెవెన్‌లో చోటు కల్పించినప్పటికీ, అతనిని నాలుగో స్థానానికి నెట్టేసిన వార్న్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

12/16/2015 - 08:19

ముంబయి, డిసెంబర్ 15: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో వచ్చే రెండేళ్ల కోసం తాత్కాలిక ప్రాతిపదికన అడుగుపెట్టిన పుణె, రాజ్‌కోట్ జట్లు తొలి ఆటగాళ్ల కొనుగోళ్లను పూర్తి చేశాయి. మంగళవారం డ్రాఫ్ట్ విధానంలో జరిగిన వేలంలో భారత పరిమిత ఓవర్ల జట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీని సంజీవ్ గోయెంకాకు చెందిన న్యూ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.

12/16/2015 - 08:17

ముంబయి, డిసెంబర్ 15: తొమ్మిదో ఐపిఎల్‌లో కొత్తగా వచ్చి చేరిన రాజ్‌కోట్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం కోసం సురేష్ రైనా, బ్రెండన్ మెక్‌కలమ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మహేంద్ర సింగ్ ధోనీని కొనుగోలు చేసిన మరో కొత్త జట్టు పుణె అతనినే కెప్టెన్‌గా నియమించడం ఖాయంగా కనిపిస్తున్నది. అయితే, రాజ్‌కోట్‌లోనే సారథ్య బాధ్యతలు ఎవరికి దక్కుతాయన్నదని ఉత్కంఠ రేపుతున్నది.

12/16/2015 - 08:16

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: నిన్నమొన్నటి వరకూ భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జరుగుతుందని ఆశించిన పిసిబికి నిరాశ తప్పలేదు. భారత్ నుంచి సిరీస్‌పై స్పష్టత లేకపోవడంతో శ్రీలంకలో ఇరు జట్లు తలపడడం అనుమానం స్థాయ నుంచి ఎదిగి అసాధ్యంగా మారింది.

12/16/2015 - 08:15

ముంబయి, డిసెంబర్ 15: ఐపిఎల్ డ్రాఫ్ట్‌లో పాల్గొన్న రాజ్‌కోట్, పుణె జట్టు చెరి ఐదుగురు ఆటగాళ్లను 39 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాయి. నిబంధనలను అనుసరించి ఈ జట్ల వద్ద చెరి 27 కోట్ల రూపాయలు ఉంటాయి. ఈ మొత్తంతోనే వారు ఫిబ్రవరి 6న జరిగే సాధారణ వేలంలో ఆటగాళ్లను కొనాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 9 నుంచి మే 29 వరకు తొమ్మిదో ఐపిఎల్ టోర్నీ జరుగుతుంది.

12/16/2015 - 08:15

ముంబయి, డిసెంబర్ 15: ఐపిఎల్ కోసం మంగళవారం నిర్వహించిన డ్రాఫ్ట్‌లో పుణె, రాజ్‌కోట్ జట్లు చెరి ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఉండగా, వేలంలో ఎవరూ పాడుకోని క్రికెటర్లకు, మిగతా వారితో కలిసి ఫిబ్రవరి 6న వేలాన్ని నిర్వహిస్తారు.

12/15/2015 - 04:48

డ్యునెడిన్, డిసెంబర్ 14: శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌ని న్యూజిలాండ్ 122 పరుగుల భారీ తేడాతో సొంతం చేసుకుంది. మ్యాచ్ నాలుగోరోజు, ఆదివారం ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడగా, చివరి రోజున అదే పరిస్థితి ఉంటుందేమోనని ఆశించిన లంకకు నిరాశ తప్పలేదు. 405 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక ఆదివారం ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది.

12/14/2015 - 07:56

గౌహతి, డిసెంబర్ 13: ఈశాన్య నగరాలు గౌహతి, షిల్లాంగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 16వ తేదీ వరకూ ఆతిథ్యమిచ్చే 12వ దక్షిణాసియా క్రీడల లోగో, మస్కట్‌ను నిర్వాహణ కమిటీ (ఒసి-ఎస్‌ఎజి) ఆదివారం విడుదల చేసింది. అసోం ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్, కేంద్ర క్రీడాశాఖ మంత్రి శర్శానంద సోనోవాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎనిమిది దేశాలకు చెందిన సుమారు 4,500 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటారని అంచనా.

Pages