S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/09/2015 - 06:06

ఢాకా, డిసెంబర్ 8: ఇంట్లో పని మనిషిని చిత్ర హింసలకు గురి చేశాడన్న ఆరోపణలపై అరెస్టయిన బంగ్లాదేశ్ క్రికెటర్ షాదత్ హొస్సేన్ సోమవారం బెయిల్‌పై విడుదలయ్యాడు. ఢాకా హైకోర్టు అతనికి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

12/09/2015 - 06:05

వెల్లింగ్టన్, డిసెంబర్ 8: శ్రీలంక ఓపెనర్ కుశాల్ పెరెరా డోప్ టెస్టులో విఫలమయ్యాడు. ఈ వార్త వెలువడిన వెంటనే కుశాల్‌పై తాత్కాలిక సస్పెన్షన్ వేటు విధించినట్టు శ్రీలంక క్రికెట్ (సిఎల్‌సి) ప్రకటించింది. అతనిని స్వదేశానికి పంపాలని జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆదేశించింది.

12/09/2015 - 06:04

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: భారత క్రికెట్‌లో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాత్ర స్పష్టంగా ఉందని, అతనికి పరస్పర ప్రయోజనాలు లేవని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ స్పష్టం చేశాడు. గంగూలీ బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

12/08/2015 - 04:54

పరుగుల పరంగా టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. 2008లో ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగిన టెస్టును 320 పరుగుల తేడాతో గెల్చుకోగా, సోమవారం దక్షిణాఫ్రికాను 337 పరుగుల భారీ ఆధిక్యంతో చిత్తుచేసింది. దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో స్థానానికి దూసుకెళ్లింది.

12/08/2015 - 04:53

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: జిడ్డు బ్యాటింగ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ షహీం ఆమ్లాను ఆ జట్టు బ్యాట్స్‌మన్ ఫఫ్ డు ప్లెసిస్ మించిపోయాడు. ఆదివారం నాటి ఆటలో 46 డాట్ బాల్స్ ఆడిన ఆమ్లా 47వ బంతిలో తొలి పరుగు చేశాడు. సోమావారం ఆ రికార్డును అధిగమించిన డు ప్లెసిస్ పరుగుల ఖాతాను తెరవడానికి 52 బంతులు మింగేశాడు.

12/08/2015 - 04:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: దక్షిణాఫ్రికా వనే్డ జట్టు కెప్టెన్ ఎబి డివిలియర్స్‌కు విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా పేరు ఉంది. వనే్డల్లో అత్యంత వేగంగా 50 (16 బంతులు), 100 (31 బంతులు), 150 (64 బంతులు) పరుగులు పూర్తి చేసి రికార్డులు నెలకొల్పిన అతను తన ఆటకు పూర్తి భిన్నంగా నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడు. 345 నిమిషాల మారథాన్ ఇన్నింగ్స్‌లో అతను 297 బంతులు ఎదుర్కొని 43 పరుగులు సాధించాడు.

12/08/2015 - 04:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: దక్షిణాఫ్రికాపై సాధించిన అపూర్వ విజయాన్ని చెన్నై బాధితులకు అంకితం ఇస్తున్నట్టు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆజింక్య రహానే, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ రవిచంద్రన్ అశ్విన్ ప్రకటించారు. టెస్టు సిరీస్‌ను 3-0 ఆధిక్యంతో సొంతం చేసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్న వారు చెన్నై బాధితులకు అండగా నిలుస్తామని చెప్పారు.

12/08/2015 - 04:58

చివరి టెస్టులో టీమిండియా ఘన విజయం *దక్షిణాఫ్రికాపై 3-0 తేడాతో సిరీస్ కైవసం

12/07/2015 - 07:03

లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్‌తో చాలెంజర్ డానియల్ జాకబ్స్‌పై విరుచుకుపడిన పీటర్ క్విలియన్ (ఎడమ). న్యూయార్క్‌లో జరిగిన ఈ డబ్ల్యుబిఎ మిడిల్‌వెయట్ బాక్సింగ్ బౌట్‌లో క్విలియన్ మొదటి రౌండ్‌లోనే నాకౌట్ ద్వారా జాకబ్స్‌ను ఓడించి టైటిల్ నిలబెట్టుకున్నాడు.

12/07/2015 - 07:02

* ఎఐబిఎ ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్

Pages