క్రీడాభూమి
డోప్ టెస్టులో కుశాల్ విఫలం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వెల్లింగ్టన్, డిసెంబర్ 8: శ్రీలంక ఓపెనర్ కుశాల్ పెరెరా డోప్ టెస్టులో విఫలమయ్యాడు. ఈ వార్త వెలువడిన వెంటనే కుశాల్‌పై తాత్కాలిక సస్పెన్షన్ వేటు విధించినట్టు శ్రీలంక క్రికెట్ (సిఎల్‌సి) ప్రకటించింది. అతనిని స్వదేశానికి పంపాలని జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆదేశించింది. ఫాస్ట్ బౌలర్ ధమ్మిక ప్రసాద్ వెన్నునొప్పి కారణంగా గురువారం నుంచి న్యూజిలాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరంకాగా, ఇప్పుడు కశాల్ సేవలను కూడా లంక కోల్పోనుంది. కుమార సంగక్కర, మహేల జయవర్ధనే వంటి మేటి బ్యాట్స్‌మెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత శ్రీలంక బ్యాటింగ్ బాధ్యత ఎక్కువగా కుశాల్‌పైనే పడింది. అతను శక్తివంచన లేకుండా జట్టుకు భారీ స్కోర్లు అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్ సందర్భంగా జరిపిన ర్యాండమ్ డోపింగ్ పరీక్షలో నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించినట్టు తేలవడంతో అతనిపై తాత్కాలికంగా వేటు పడింది. ఈ పరిణామం లంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్‌కు ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించడం ఖాయం.