క్రీడాభూమి

మారథాన్ ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: దక్షిణాఫ్రికా వనే్డ జట్టు కెప్టెన్ ఎబి డివిలియర్స్‌కు విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా పేరు ఉంది. వనే్డల్లో అత్యంత వేగంగా 50 (16 బంతులు), 100 (31 బంతులు), 150 (64 బంతులు) పరుగులు పూర్తి చేసి రికార్డులు నెలకొల్పిన అతను తన ఆటకు పూర్తి భిన్నంగా నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడు. 345 నిమిషాల మారథాన్ ఇన్నింగ్స్‌లో అతను 297 బంతులు ఎదుర్కొని 43 పరుగులు సాధించాడు. అతను క్రీజ్‌లో ఉన్నంత సేపు దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌ని డ్రా చేసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.