-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
న్యూఢిల్లీ, అక్టోబర్ 3: మాజీ క్రికెటర్ వీరేందర్ సెవాగ్‌ను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) గురువారం ఘనంగా సన్మానించింది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగవ, చివరి టెస్టుకు ముందు వీరూను బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ సన్మానించి, రంజీ ట్రోఫీని జ్ఞాపికగా బహూకరించాడు.
భారత్ 7 వికెట్లకు 231 దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు 4 వికెట్లు కూల్చిన పిడిట్
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం నుంచి ప్రారంభం కానున్న నాలుగో, చివరి టెస్టులో అందరి దృష్టి ఆటగాళ్ల కంటే ఎక్కువగా పిచ్‌పై కేంద్రీకృతమైంది. మొహాలీ వికెట్‌పై పరుగులు రాబట్టుకోవడం కష్టంకాగా, వికెట్లు పేకముక్కల్లా కూలాయి. బెంగళూరు టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసినప్పటికీ, ఆట సాధ్యమైన ఒక్క రోజే 12 వికెట్లు పడ్డాయి. నాగపూర్ టెస్టు రెండున్నర రోజుల్లోనే ముగిసింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 2: దక్షిణాఫ్రికాలో పిచ్‌లపై వివిధ జట్లు యాభై లేదా వంద పరుగులకే ఆలౌటైనప్పుడు అక్కడి మీడియా ఎందుకు మాట్లాడలేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలదీశాడు. నాగపూర్ పిచ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతుండగా, సఫారీ మీడియా మొత్తం భారత్‌లో క్రీడాస్ఫూర్తి లోపించిందని ధ్వజమెత్తుతున్నది.
సిద్దిపేట, డిసెంబర్ 2 : క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయని, గెలుపు, ఓటములను క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్, కోచ్ అబీద్ అలీ అన్నాడు. మెదక్ జిల్లా సిద్దిపేట మినీస్టేడియంలో బుధవారం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు ఆటపై ప్రత్యేక దృష్టి సారించాలన్నాడు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఫిరోజ్ షా కోట్లా మైదానం భారత్‌కు కలిసొచ్చింది. ఇక్కడ భారత జట్టు 1987లో చివరిసారి పరాజయాన్ని చవి చూసింది. వెస్టిండీస్ చేతిలో ఓడిన తర్వాత ఇప్పటి వరకూ ఈ మైదానంలో పదిమ్యాచ్‌లు ఆడిన టీమిండియా తొమ్మిది విజయాలు నమోదు చేసింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఒక కేంద్రంలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడకుండా అత్యధిక విజయాలను సాధించిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.
రాయ్‌పూర్, డిసెంబర్ 2: హాకీ వరల?డ లీగ్ (హెచ్‌డబ్ల్యుఎల్) ఫైనల్స్‌లో భారత జట్టు ముందంజ వేయడం కష్టంగా కనిపిస్తున్నది. నిలకడ లోపించిన ఈ జట్టు గురువారం నాటి క్వార్టర్ ఫైనల్స్‌లో పటిష్టమైన గ్రేట్ బ్రిటన్‌ను ఢీ కొనాల్సి ఉంది. పూల్ ‘బి’ నుంచి పోటీపడుతున్న భారత్ ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ఇప్పటివరకు భారత్‌తో జరిగిన రెండు టెస్టుల్లోను స్పిన్ ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడిన దక్షిణాఫ్రికా జట్టు మంగళవారం ఇక్కడి ఫిరోజ్‌షా కోట్లా పిచ్‌ని చూసిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈ పిచ్ మూడు రోజులకన్నా ఎక్కువ రోజులు కొనుసాగేదిగా కనపిస్తోందని ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ అడ్రియన్ బిరెల్ చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనం.
చెన్నై, డిసెంబర్ 1: సెర్బియాకు చెందిన ప్రపంచ మాజీ ఎనిమిదో ర్యాంకు ఆటగాడు జాంకో తిప్సెర్విచ్ వచ్చే 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే చెన్నై ఓపెన్ 20వ ఎడిషన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పాల్గొననున్నట్లు ధ్రువీకరించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి 50 స్థానాల్లో కొనసాగుతున్న ఆటగాళ్లకు చెన్నై ఓపెన్ మెయిన్ డ్రాలో నేరుగా చోటు కల్పిస్తున్న విషయం విదితమే.
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాడు యూకీ బాంబ్రీతో పాటు సోమ్‌దేవ్ దేవర్మన్ స్థానాలు స్వల్పంగా పతనమయ్యాయి. భారత్‌లో నెంబర్ వన్ సింగిల్స్ ఆటగాడిగా కొనసాగుతున్న బాంబ్రీ తాజాగా ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు దిగజారి 93వ ర్యాంకుకు చేరుకోగా, సోమ్‌దేవ్ కూడా రెండు ర్యాంకులు దిగజారి 181వ స్థానానికి చేరుకున్నాడు.