క్రీడాభూమి

రహానే ఒంటరి పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ 7 వికెట్లకు 231 దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు 4 వికెట్లు కూల్చిన పిడిట్
న్యూఢిల్లీ, డిసెంబర్ 3: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం ఇక్కడ ప్రారంభమైన చివరి, నాలుగో టెస్టు కూడా లోస్కోరింగ్ మ్యాచ్‌గానే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ బ్యాటింగ్ నిలకడగా సాగలేదు. అజింక్య రహానే అజేయ అర్ధ శతకం, కెప్టెన్ విరాట్ కోహ్లీ సమయోచిత బ్యాటింగ్ కొంత వరకు ఆదుకోవడంతో, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో అత్యధిక స్కోరు ఇదేకావడం విశేషం. దక్షిణాఫ్రికా బౌలర్ డేన్ పిడిట్ నాలుగు వికెట్లు కూల్చగా, కేల్ అబోట్‌కు మూడు వికెట్లు లభించాయి.
టీమిండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మురళీ విజయ్, శిఖర్ ధావన్ మొదటి వికెట్‌కు 30 పరుగులు జోడించారు. పిడిట్ బౌలింగ్‌లో కెప్టెన్ హషీం ఆమ్లా క్యాచ్ అందుకోగా విజయ్ (12) అవుట్‌కావడంతో భారత్ వికెట్ల పతనం ఆరంభమైంది. 85 బంతులోవ్ల 33 పరుగులు చేసిన ధావన్‌ను పిడిట్ ఎల్‌బిగా పెవిలియన్ చేర్చాడు. చటేశ్వర్ పుజారా 14 పరుగులకే అబోట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌కాగా, జట్టును ఆదుకునే బాధ్యతను కోహ్లీ, రహానే స్వీకరించారు. నాలుగో వికెట్‌కు 50 పరుగులు జత కలిసిన తర్వాత పిడిట్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ డేన్ విలాస్ క్యాచ్ పట్టగా 44 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద కోహ్లీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా క్రీజ్‌లో నిలవలేక కేవలం ఒక్కో పరుగు చేసి అవుటయ్యారు. రవీంద్ర జడేజా కొద్దిసేపు క్రీజ్‌లో నిలిచి, 59 బంతుల్లో 24 పరుగులు చేసి అబోట్ బౌలింగ్‌లో డీన్ ఎల్గార్‌కు చిక్కాడు. భారత్ 84 ఓవర్లలో 7 వికెట్లకు 231 పరుగులు చేసే సమయానికి రహానే 89, అశ్విన్ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 155 బంతులు ఎదుర్కొన్న రహానే స్కోరులో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. (చిత్రం) టాప్ స్కోరర్ రహానే
* భారత బ్యాట్స్‌మన్ ఆజింక్య రహానే గత ఆరు ఇన్నింగ్స్‌లో వరుసగా 7, 1, 15, 2, 13, 9 చొప్పున పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను అర్ధ శతకం పూర్తి చేయడం విశేషం. కెరీర్‌లో అతనికి ఇది ఎనిమిదో హాఫ్ సెంచరీ. మురళీ విజయ్ క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికి నానా తంటాలు పడ్డాడు. అతను 59 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు చేయగలిగాడు. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో భారత్ చివరిసారి 1987లో పరాజయాన్ని చవిచూసింది. ఆతర్వాత ఇప్పటి వరకూ తొమ్మిది విజయాలను నమోదు చేసింది.
* దక్షిణాఫ్రికా స్పిన్నర్ పిడిట్‌కు కెరీర్‌లో ఇది రెండో టెస్టు. తన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులకు నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో 62 పరుగులకు నాలుగు చొప్పున అతను వికెట్లు పడగొట్టాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ అతనికి నాలుగు వికెట్లు లభించాయి. రెండో ఇన్నింగ్స్‌లో ఎన్ని వికెట్లు సాధిస్తాడో చూడాలి. కాగా, పిడిట్ బౌలింగ్‌లో బంతి ఏ దిశలో వస్తుందో అర్థం చేసుకోవడంలో భారత బ్యాట్స్‌మెన్ విఫలమ య్యారు. ఇప్పటి వరకూ అతని బౌలింగ్‌ను ఎదుర్కొనే అవకాశం రాకపోవడంతో రహానేసహా భారత బ్యాట్స్‌మెన్ అందరూ అతని బంతులకు సమర్థంగా ఎదురునిలవలేకపోయారు.
* కేల్ అబోట్ అందరి కంటే చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. అతను 17 ఓవర్లు బౌల్ చేసి, 23 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సగటున అతను ఇచ్చిన పరుగులు 1.35. ఇమ్రాన్ తాహిర్ 7 ఓవర్లలో 36 (సగటున 5.14) పరుగులు సమర్పించుకొని దక్షిణాఫ్రికాకు ఖరీదైన బౌలర్‌గా మారాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లకు 231 పరుగులు చేసింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో నమోదైన అత్యధిక స్కోరు ఇదే. ఇంతకుముందు, నాగపూర్‌లో జరిగిన మూడో టెస్టులో భారత్ 215 పరుగులు సాధించింది.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: మురళీ విజయ్ సి ఆమ్లా బి పిడిట్ 12, శిఖర్ ధావన్ ఎల్‌బి పిడిట్ 33, చటేశ్వర్ పుజారా బి అబోట్ 14, విరాట్ కోహ్లీ సి విలాస్ బి పిడిట్ 44, ఆజింక్య రహానే నాటౌట్ 89, రోహిత్ శర్మ సి ఇమ్రాన్ తాహిర్ బి పిడిట్ 1, వృద్ధిమాన్ సాహా బి అబోట్ 1, రవీంద్ర జడేజా సి ఎల్గార్ బి అబోట్ 24, అశ్విన్ నాటౌట్ 6, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (84 ఓవర్లలో 7 వికెట్లకు) 321.
వికెట్ల పతనం: 1-30, 2-62, 3-66, 4-136, 5-138, 6-139, 7-198.
బౌలింగ్: మోర్న్ మోర్కెల్ 17-5-40-0, కేల్ అబోట్ 17-6-23-3, డేన్ పిడిట్ 34-5-101-4, ఇమ్రాన్ తాహిర్ 7-1-36-0, డీన్ ఎల్గార్ 5-0-15-0, జెపి డుమినీ 4-0-12-0.