క్రీడాభూమి

జయాపజయాలను సమంగా తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, డిసెంబర్ 2 : క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయని, గెలుపు, ఓటములను క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్, కోచ్ అబీద్ అలీ అన్నాడు. మెదక్ జిల్లా సిద్దిపేట మినీస్టేడియంలో బుధవారం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు ఆటపై ప్రత్యేక దృష్టి సారించాలన్నాడు. క్రీడాకారులు జట్టుగా, సమష్టిగా కృషిచేస్తేనే విజయాలు దరిచేరుతాయన్నాడు. క్రీడలు స్నేహపూర్వకమైన వాతావరణంలో జరగాలని సూచించాడు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించాడు. ఆంధ్ర రంజీ మాజీ కెప్టెన్ షాబుద్దీన్ మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడలను ఎప్పుడు మొక్కుబడిగా ఆడవద్దని, వందశాతం మనస్సును లగ్నం చేసి ఆడాలని పిలుపునిచ్చాడు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభను కనబరిస్తేనే రాష్ట స్థాయి పోటీలకు ఎంపికకు మార్గం సుగమం అవుతుందని తెలిపాడు. క్రీడల్లో ప్రతిభ వున్న వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్నాడు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు మంచి ఫిట్‌నెస్‌తో వుంటారని, వారి నైపుణ్యాన్ని వెలికితీస్తే భవిష్యత్తులో మంచి క్రీడకారులుగా ఎదుగుతారన్నాడు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలోని మాణిక్యాలాంటి క్రీడాకారులను వెలికితీయడమే టిసిఎస్ ముఖ్య ఉద్దేశమన్నాడు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ప్రతిభను పదునుపెట్టేందుకు టిసిఎస్ పక్షాన పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపాడు. చక్కని ప్రతిభ కనబర్చిన క్రీడారులను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్లాట్‌ఫాం ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తామన్నాడు. తెలంగాణలోని అన్ని జిల్లాలో టిసిఎస్ పక్షాన పోటీలు నిర్వహించి జిల్లా స్థాయి జట్లను ఎంపిక చేయనున్నట్లు తెలిపాడు. జిల్లా జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్నామన్నాడు. క్రీడాకారులకు అవసరమైన మెటిరియల్, డ్రెస్సులు టిసిఎస్ పక్షాన అందచేస్తామన్నాడు.