క్రీడాభూమి

భారత్‌కు కలిసొచ్చిన మైదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఫిరోజ్ షా కోట్లా మైదానం భారత్‌కు కలిసొచ్చింది. ఇక్కడ భారత జట్టు 1987లో చివరిసారి పరాజయాన్ని చవి చూసింది. వెస్టిండీస్ చేతిలో ఓడిన తర్వాత ఇప్పటి వరకూ ఈ మైదానంలో పదిమ్యాచ్‌లు ఆడిన టీమిండియా తొమ్మిది విజయాలు నమోదు చేసింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఒక కేంద్రంలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడకుండా అత్యధిక విజయాలను సాధించిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.
కోట్లా మైదానంలో 1987 నుంచి ఇప్పటి వరకూ నాలుగో ఇన్నింగ్స్‌లో ఒక్క టెస్టు సెంచరీ కూడా నమోదు కాలేదు. 1999లో పాకిస్తాన్‌పై భారత బ్యాట్స్‌మన్ శడగోపన్ రమేష్ చేసిన 96 పరుగులే 1987 తర్వాత నాలుగో ఇన్నింగ్స్‌లో ఇక్కడ అత్యధిక స్కోరు.
ఈ సిరీస్‌లో ఇప్పటి వరకూ జరిగిన మూడు టెస్టుల్లో కలిపి స్పిన్నర్లు ప్రతి వంద బంతులకు సగటున 31 వికెట్లు పడగొట్టారు. టెస్టు క్రికెట్ చరిత్రలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన సిరీస్‌లను పరిగణలోకి తీసుకుంటే, స్పిన్నర్ల అత్యుత్తమ స్ట్రయిక్ రేట్‌లో ఇది రెండోది.