క్రీడాభూమి

చెన్నై ఓపెన్‌కి వచ్చేస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 1: సెర్బియాకు చెందిన ప్రపంచ మాజీ ఎనిమిదో ర్యాంకు ఆటగాడు జాంకో తిప్సెర్విచ్ వచ్చే 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే చెన్నై ఓపెన్ 20వ ఎడిషన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పాల్గొననున్నట్లు ధ్రువీకరించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి 50 స్థానాల్లో కొనసాగుతున్న ఆటగాళ్లకు చెన్నై ఓపెన్ మెయిన్ డ్రాలో నేరుగా చోటు కల్పిస్తున్న విషయం విదితమే. దీంతో ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 39వ స్థానంలో కొనసాగుతున్న తిప్సెర్విచ్‌కు ఈ టోర్నీ మెయిన్ డ్రాలో ఆటోమ్యాటిక్‌గా స్థానం లభించింది. తిప్సెర్విచ్ చేరికతో ఈసారి చెన్నై ఓపెన్‌లో తలపడే ప్రపంచ టాప్-50 జాబితాలో ఆటగాళ్ల సంఖ్య 10కి చేరింది. ఇంతకుముందు తిప్సెర్విచ్ 2012 చెన్నై ఓపెన్ సింగిల్స్ ఫైనల్‌లో కెనడా ఆటగాడు మిలోస్ రవోనిక్‌తో సుదీర్ఘంగా 194 నిమిషాలు పోరాడి ఓడినప్పటికీ భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్‌తో కలసి డబుల్స్ టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే.

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జ్యోత్స్నకు 13వ స్థానం

చెన్నై, డిసెంబర్ 1: ప్రపంచ స్క్వాష్ ర్యాంకింగ్స్‌లో భారత సీనియర్ క్రీడాకారిణి జ్యోత్స్న చిన్నప్ప నాలుగు స్థానాలను మెరుగుపరుచుకుంది. గత నెల దోహాలో జరిగిన కతార్ క్లాసిక్ ఈవెంట్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన జ్యోత్స్న మంగళవారం తాజాగా విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో 17వ స్థానం నుంచి 13వ స్థానానికి ఎగబాకింది. కతార్ క్లాసిక్ ఈవెంట్‌లో ఈజిప్టుకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి రనీమ్ ఎల్ వెలిలీపై జ్యోత్స్న విజయం సాధించడం ఆమె ఉన్నతికి దోహదపడింది. అయితే భారత్‌లో అత్యున్నత ర్యాంకర్‌గా కొనసాగుతున్న దీపికా పల్లికల్ తాజా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానం నుంచి 16వ స్థానానికి దిగజారింది. అలాగే పురుషుల ర్యాంకింగ్స్‌లో నేషనల్ చాంపియన్ సౌరవ్ ఘోసల్ కూడా 18వ స్థానానికి దిగజారాడు.