క్రీడాభూమి

హెచ్‌డబ్ల్యుఎల్ క్వార్టర్స్ గెలుపు డౌటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, డిసెంబర్ 2: హాకీ వరల?డ లీగ్ (హెచ్‌డబ్ల్యుఎల్) ఫైనల్స్‌లో భారత జట్టు ముందంజ వేయడం కష్టంగా కనిపిస్తున్నది. నిలకడ లోపించిన ఈ జట్టు గురువారం నాటి క్వార్టర్ ఫైనల్స్‌లో పటిష్టమైన గ్రేట్ బ్రిటన్‌ను ఢీ కొనాల్సి ఉంది. పూల్ ‘బి’ నుంచి పోటీపడుతున్న భారత్ ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. నెదర్లాండ్స్, అర్జెంటీనా జట్ల చేతిలో పరాజయాలను ఎదుర్కోగా, జర్మనీతో మ్యాచ్‌ని డ్రా చేసుకుంది. సామర్థ్యం ఉన్నప్పటికీ నిలకగా ఆడలేకపోతున్న కారణంగా జట్టు ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్నదని హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్, తాత్కాలిక కోచ్ రోలాండ్ ఆల్ట్‌మన్స్ వాపోతున్నాడు. ఈ సమస్య నుంచి బయటపడితేగానీ బ్రిటన్‌కు భారత్ గట్టిపోటీని ఇవ్వలేదు.

పుణె సిటీపై
నార్త్‌ఈస్ట్ గెలుపు

గౌహతి, డిసెంబర్ 2: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో బుధవారం పుణె సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌ను ఢీకొన్న నార్త్‌ఈస్ట్ యు నైటెడ్ 3-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభమైన నాలుగో నిమిషంలోనే నికొల స్ వెలెజ్ ద్వారా నార్త్‌ఈస్ట్‌కు గోల్ లభించగా, మ రో నాలుగు నిమిషాల్లోనే పుణెకు జేమ్స్ బెయలీ ఈక్వెలైజర్‌ను అందించాడు. ప్రత్యర్థి గోల్ చేయ డంతో కంగుతిన్న నార్త్‌ఈస్ట్ ఆటగాళ్లు దాడులను ముమ్మరం చేశారు. 18వ నిమిషంలో డియామం గ్‌సీ కమొరా చేసిన గోల్‌తో ఆ జట్టు 2-1 ఆధిక్యత ను సంపాదించింది. మ్యాచ్ 43వ నిమిషంలో నార్‌త ఈస్ట్‌కు ఆండ్రె బికే థ్వారా మరో గోల్ లభించింది. దీనితో ఆ జట్టు 3-1 ఆధిక్యానికి దూసుకెళ్లింది. అ నంతరం విజయం తమదేనన్న ధీమాతో నింపాది గా ఆడడం ప్రారంభించింది. నార్త్‌ఈస్ట్ ఆటగాళ్ల ని ర్లక్ష్యాన్ని సొమ్ము చేసుకున్న పుణె 86వ నిమిషంలో గోల్‌ను సంపాదించింది. ఆడ్రియన్ ముతు ఈ గో ల్ చేశాడు. ఆతర్వాత మరో గోల్ నమోదు కాకపో వడంతో నార్త్‌ఈస్ట్ విజయాన్ని నమోదు చేసి, మొ త్తం 20 పాయంట్లతో నాలుగో స్థానికి చేరింది. 15 పాయంట్లతో పుణె ఆరో స్థానంలో ఉంది. డిఫెం డింగ్ చాంపియన్ అట్లాటికో డి కోల్‌కతా 23 పా యంట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.

ఇండోనేషియా బాడ్మింటన్
భారత్ శుభారంభం

మలాంగ్ (ఇండోనేషియా), డిసెంబర్ 2: ఇక్కడ ప్రారంభమైన ఇండోనేషియా గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. పివి సింధు, కిడాంబి శ్రీకాంత్, గురుసాయిదత్, ప్రణయ్ తమతమ విభాగాల్లో మొదటి రౌండ్ మ్యాచ్‌లను సులభంగా పూర్తి చేశారు. మహిళల సింగిల్స్‌లో సింధు 21-16, 19-21, 21-12 తేడాతో గ్రెగొరియా మరిస్కాను ఓడించగా, పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 21-16, 21-12 ఆధిక్యంతో విబొవో సెత్యల్దీ పుత్రపై గెలిచాడు. గురుసాయిదత్ 21-10, 21-3 స్కోరుతో మహమ్మద్ అదియల్ అక్టా ఖైరుల్లాను ఇంటిదారి పట్టించాడు. ప్రణయ్ 21-16, 21-16 తేడాతో పన్జీ అహ్మద్ వౌలానాపై విజయం సాధించాడు.

ఐపిటిఎల్ నుంచి
వైదొలగిన జొకోవిచ్

కోబ్ (జపాన్), డిసెంబర్ 2: ఇండియన్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపిటిఎల్) నుంచి ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ వైదొలిగాడు. అవిశ్రాంతంగా టోర్నీల్లో ఆడుతున్నందువల్ల మానసికంగా, శారీరకంగా అలసిపోయానని అతను ప్రకటించాడు. అందుకే ఐపిటిఎల్‌కు హాజరుకావడం లేదని తెలిపాడు. కాగా, అతని స్థానంలో బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే ఒయుఇ సింగపూర్ స్లామర్స్ జట్టులో చేరతాడు.