క్రీడాభూమి

కోట్లాలో కోహ్లీ పాగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చివరి టెస్టులో టీమిండియా ఘన విజయం *దక్షిణాఫ్రికాపై 3-0 తేడాతో సిరీస్ కైవసం

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సొంత గడ్డపై విజయభేరి మోగించాడు. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి, నాలుగో టెస్టును టీమిండియా 337 పరుగుల భారీ తేడాతో గెల్చుకొని, నెల్సన్ మండేలా- మహాత్మా గాంధీ సిరీస్‌ను 3-0 ఆధిక్యంతో కైవసం చేసుకుంది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టి, దక్షిణాఫ్రికాను రెండో ఇన్నింగ్స్‌లో దెబ్బతీశాడు. ఒకానొక దశలో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు కనిపించినప్పటికీ ఉమేష్ యాదవ్ కీలక సమయంలో వికెట్లు పడగొట్టి టీమిండియా విజయానికి బాటలు వేశాడు. మిగతా కార్యక్రమాన్ని అశ్విన్, రవీంద్ర జడేజా పూర్తి చేశారు. 481 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా 143.1 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను అల్లాడించే ఎబి డివిలియర్స్ క్రీజ్‌లో పాతుకుపోయి, మారథాన్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ దక్షిణాఫ్రికాను ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లోనూ శతకాలను నమోదు చేసిన ఆజింక్య రహానేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా, ఈ సిరీస్‌లో 31 వికెట్లు పడగొట్టిన అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు.
రెండో ఇన్నింగ్స్‌లో అసాధ్యమైన 481 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మ్యాచ్ నాలుగో రోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లకు 72 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం ఉదయం ఆటను కొనసాగించి మరో నాలుగు పరుగులకే కెప్టెన్ హషీం ఆమ్లా వికెట్ కోల్పోయింది. అతను 288 నిమిషాలు క్రీజ్‌లో నిలిచి, 244 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లతో 25 పరుగులు చేసి, జడేజా అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆతర్వాత డివిలియర్స్, ఫఫ్ డు ప్లెసిస్ మ్యాచ్‌ని డ్రా చేసుకునే లక్ష్యంతో జిడ్డు బ్యాటింగ్‌ను కొనసాగించారు. వీరి తీరును చూస్తే ఈ మ్యాచ్‌లో ఫలితం సాధ్యం కాదేమోనన్న అనుమానం తలెత్తింది. అయితే, 111 పరుగుల స్కోరువద్ద డుప్లెసిస్‌ను జడేజా ఎల్‌బిగా అవుట్ చేశాడు. పరుగుల ఖాతా తెరవని జెపి డుమినీ 16 బంతులు ఎదుర్కొని, చివరికి అశ్విన్ బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. వికెట్‌కీపర్ డేన్ విలాస్ 13 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో బౌల్డ్‌కావడంతో మ్యాచ్‌ని డ్రా చేసుకొని పరువు నిలబెట్టుకోవాలన్న దక్షిణాఫ్రికా ఆశలకు గండిపడింది. తన స్వతఃసిద్ధమైన బ్యాటింగ్ విధానానికి భిన్నంగా ఆడి, భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన డివిలియర్స్ 43 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అశ్విన్ బౌలింగ్‌లో జడేజా లెగ్ స్లిప్ స్థానంలో మెరుపు క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఈ వికెట్‌తో దక్షిణాఫ్రికా పరాజయం ఖాయంగా కనిపించింది. కేల్ అబోట్ (0), డేన్ పిడిట్ (1) వెంటవెంటనే పెవిలియన్ చేరగా, మోర్న్ మోర్కెల్ (2)ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌కు తెరపడింది. అప్పటికి ఒక బంతిని ఎదుర్కొన్న ఇమ్రాన్ తాహిర్ పరుగులు చేయకుండా క్రీజ్‌లో ఉన్నాడు. భారత బౌలర్లలో అశ్విన్‌కు ఐదు, ఉమేష్ యాదవ్‌కు మూడు, జడేజాకు రెండు చొప్పున వికెట్లు లభించాయి.

స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 117.5 ఓవర్లలో 334 ఆలౌట్ (విరాట్ కోహ్లీ 44, ఆజింక్య రహానే 127, రవిచంద్రన్ అశ్విన్ 56, కేల్ అబోట్ 5/40, డేన్ పిడిట్ 4/117).
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 49.3 ఓవర్లలో 121 ఆలౌట్ (ఎబి డివిలియర్స్ 42, టెంబా బవుమా 22, రవీంద్ర జడేజా 5/30, ఉమేష్ యాదవ్ 2/32, అశ్విన్ 2/26).
భారత్ రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 4 వికెట్లకు 190): మురళీ విజయ్ సి విలాస్ బి మోర్కెల్ 3, శిఖర్ ధావన్ బి మోర్కెల్ 21, రోహిత్ శర్మ బి మోర్కెల్ 0, చటేశ్వర్ పుజారా బి ఇమ్రాన్ తాహిర్ 28, విరాట్ కోహ్లీ ఎల్‌బి అబోట్ 88, ఆజింక్య రహానే నాటౌట్ 100, వృద్ధిమాన్ సాహా నాటౌట్ 23, ఎక్‌స్ట్రాలు 4, మొత్తం (100.1 ఓవర్లలో 5 వికెట్లకు) 267.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 2 వికెట్లకు 72): డీన్ ఎల్గార్ సి రహానే బి అశ్విన్ 4, టెంబా బవూమా బి అశ్విన్ 34, హషీం ఆమ్లా బి జడేజా 25, ఎబి డివిలియర్స్ సి జడేజా బి అశ్విన్ 43, డు ప్లెసిస్ ఎల్‌బి జడేజా 10, డుమినీ ఎల్‌బి అశ్విన్ 0, డేన్ విలాస్ బి ఉమేష్ యాదవ్ 13, కేల్ అబోట్ బి ఉమేష్ యాదవ్ 0, డేన్ పిడెట్ సి వృద్ధిమాన్ సాహా బి ఉమేష్ యాదవ్ 1, మోర్న్ మోర్కెల్ బి అశ్విన్ 2, ఇమ్రాన్ తాహిర్ నాటౌట్ 0, ఎక్‌స్ట్రాలు 11, మొత్తం (143.1 ఓవర్లలో ఆలౌట్) 143.
వికెట్ల పతనం: 1-5, 2-49, 3-76, 4-111, 5-112, 6-136, 7-136, 8-140, 9-143, 10-143.
బౌలింగ్: ఇశాంత్ శర్మ 20-12-23-0, అశ్విన్ 49.1-36-61-5, జడేజా 46-33-26-2, ఉమేష్ యాదవ్ 21-16-9-3, శిఖర్ ధావన్ 3-1-9-0, మురళీ విజయ్ 2-0-2-0, విరాట్ కోహ్లీ 1-1-0-0, చటేశ్వర్ పుజారా 1-0-2-0.