క్రీడాభూమి

ఆమ్లాను మించిన డు ప్లెసిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: జిడ్డు బ్యాటింగ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ షహీం ఆమ్లాను ఆ జట్టు బ్యాట్స్‌మన్ ఫఫ్ డు ప్లెసిస్ మించిపోయాడు. ఆదివారం నాటి ఆటలో 46 డాట్ బాల్స్ ఆడిన ఆమ్లా 47వ బంతిలో తొలి పరుగు చేశాడు. సోమావారం ఆ రికార్డును అధిగమించిన డు ప్లెసిస్ పరుగుల ఖాతాను తెరవడానికి 52 బంతులు మింగేశాడు. అత్యంత నిదానంగా ఒక ఇన్నింగ్స్‌లో తొలి పరుగు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో జింబాబ్వే ఆటగాడు గ్రాంట్ ఫ్లవర్ (న్యూజిలాండ్‌పై 51వ బంతిలో తొలి పరుగు)ను నాలుగో స్థానానికి నెట్టిన డు ప్లెసిస్ మూడో స్థానాన్ని ఆక్రమించాడు. జాన్ ముర్రే (ఇంగ్లాండ్/ 1962లో ఆస్ట్రేలియాపై 80 బంతులు), స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్/ 2013లో న్యూజిలాండ్‌పై 63 బంతులు) మాత్రమే ఈ జాబితాలో డు ప్లెసిస్ కంటే ముందున్నారు.