క్రీడాభూమి
అది భారత్ ఇష్టం! బాయ్‌కాట్ వ్యంగ్యాస్త్రాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
లండన్, డిసెంబర్ 8: పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడడం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉందని, తప్పకుండా ఆడి తీరాలన్న నిబంధన ఏదీ లేదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జెఫ్ బాయ్‌కాట్ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయ వనరులున్న క్రికెట్ బోర్డుగా ఎదిగింది కాబట్టి బిసిసిఐ చెప్పిందే ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో శాసనమవుతుందని వ్యాఖ్యానించాడు. ధన బలంతో శాసిస్తున్న బిసిసిఐని ఎదరించే శక్తి ఎవరికీ లేదన్నాడు. సిరీస్ ఆడాలనుకుంటే ఆడుతుందని, లేదనుకుంటే రద్దు చేసుకుంటుందని, ఐసిసిసహా ఎవరూ భారత్‌పై ఒత్తిడి తీసుకురాలేరని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాయ్‌కాట్ అన్నాడు. నిజానికి భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్‌లను ఇరు దేశాల్లోని అభిమానులు కోరుకుంటున్నారని అన్నాడు. సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో సిరీస్‌లు జరగాలని అంతా అనుకుంటుంటే, అందుకు భిన్నంగా చాలా తక్కువ సిరీస్‌లు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. అరకొర సిరీస్‌లకు కూడా ఇప్పుడు గండి పడిందన్నాడు. భారత్, పాక్ మధ్య ఎక్కువ సిరీస్‌లు జరగాలన్నదే తన అభిప్రాయమన్నాడు.
వద్దే వద్దు..
బిసిసిఐకి శివసేన డిమాండ్
ముంబయి: పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలు వద్దని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)ని శివసేన డిమాండ్ చేసింది. ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ భారత్ వచ్చినప్పుడు బిసిసిఐ ప్రధాన కార్యాలయంపై శివసేన కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. పాక్‌తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దేశ ఆటగాళ్లను దేశంలో అడుగుపెట్టనీయమని తేల్చిచెప్పింది. కాగా, పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ను శ్రీలంకలో ఆడేందుకు బిసిసిఐ అంగీరించడాన్ని సమ్నా పత్రిక సంపాదకీయంలో శివసేన తప్పుపట్టింది. పాక్‌తో క్రికెట్ సిరీస్ ఆడడం అంటే ముంబయిపై జరిగిన దాడిలో పట్టుబడిన అజ్మల్ కసబ్‌కు మద్దతు పలకడమేనని వ్యాఖ్యానించింది. ముంబయిపై ఉగ్రవాద దాడులను బిసిసిఐ పట్టించుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. పాక్‌తో క్రికెట్ సంబంధాలను అంగీకరించే పరిస్థితి ప్రస్తుతం లేదని స్పష్టం చేసింది.