క్రీడాభూమి

భారత్, పాక్ క్రికెట్ సిరీస్‌పై వీడని సస్పెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జరుగుతుందా? లేదా? అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతున్నది. శ్రీలంకలో సిరీస్ ఆడాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఇటీవల నిర్ణయించాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ప్రతిపాదన పంపిన వెంటనే నవాజ్ షరీఫ్ సర్కారు ఆమోద ముద్ర వేసింది. దీనితో ఇప్పుడు బంతి భారత్ కోర్టులో ఉంది. లంకలో సిరీస్ ఆడేందుకు అనుమతించాలని కోరుతూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఇప్పటికే విదేశాంగ శాఖకు లేఖ రాసింది. కానీ, ఇప్పటి వరకూ ఎలాంటి సమాధానం రాకపోవడంతో, కేంద్ర నిర్ణయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, కొన్ని రాజకీయ పార్టీలు పాక్‌తో క్రికెట్ సంబంధాలను వ్యతిరేకించడం వంటి అంశాలు నరేంద్ర మోదీ సర్కారు ఆలోచనలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. తటస్థ వేదికపై సిరీస్ జరిగినా, అందుకు అనుమతించడం వల్ల దేశంలో కోట్లాది మంది నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం కేంద్రాన్ని వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నది. సాధారణ పరిస్థితుల్లో క్రీడా సంబంధమైన విషయాల్లో కేంద్రం అనుమతులు ఇవ్వడం లాంఛనమే. బోర్డు వర్గాలు కూడా నిన్నటి వరకూ ఇదే విషయాన్ని పేర్కొంటూ వచ్చాయి. సిరీస్‌కు అనుమతి లభిస్తుందని, కేంద్రం తప్పకుండా అనుమతిస్తుందని ధీమా వ్యక్తం చేశాయి. అయితే, ఇప్పుడు బోర్డు అధికారుల్లోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి. కాలయాపన చేయడం ద్వారా ఈ అనుమానాలను కేంద్రం రెట్టింపు చేస్తున్నది. డిసెంబర్ 15 నుంచి సిరీస్ ఆరంభం కావాలంటే, అందుకు కనీసం రెండు వారాల ముందుగానే సన్నాహాలు మొదలుపెట్టాలి. చివరి క్షణంలో అనుమతి లభిస్తే, పోటీపడే ఇరు దేశాల క్రికెట్ బోర్డులతోపాటు ఆతిథ్యమిచ్చే శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మూడు వనే్డలు, రెండు టి-20 మ్యాచ్‌ల సిరీస్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి ఎస్‌ఎల్‌సి సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ భారత ప్రభుత్వం నుంచి సమాధానం రాకపోవడంతో బిసిసిఐ అధికారులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం విదేశీ పర్యటలో ఉన్న సుష్మా స్వరాజ్ స్వదేశం చేరుకున్న వెంటనే సిరీస్‌కు అనుకూలంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉందని బోర్డు అధికారులు ఇప్పటికీ ఆశాభావంతో ఉన్నారు.

జ్యోతిష్కుడిని కాను
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ జరుగుతుందో లేదో చెప్పడానికి తానేమీ జ్యోతిష్కుడిని కానని బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ వ్యాఖ్యానించాడు. వచ్చే రెండు సీజన్లలో ఐపిఎల్‌లో ఆడేందుకు రెండు ఫ్రాంచైజీలను ఎంపిక చేసేందుకు మంగళవారం జరిగిన సమావేశంలో మనోహర్ పాల్గొన్నాడు. అనంతరం అతను విలేఖరులతో ముచ్చటించాడు. పలు అంశాలపై మాట్లాడుతున్న సమయంలోనే, కొంత మంది విలేఖరులు పాక్‌తో శ్రీలంకలో సిరీస్ జరిగే అవకాశాలపై అతనిని ప్రశ్నించారు. దీనితో అసహనానికి గురైన మనోహర్ తాను జ్యోతిష్కుడిని కానని, ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చెప్పలేనని అన్నాడు. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఇస్లామాబాద్‌లో పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్‌తో భేటీ కానున్న విషయాన్ని ప్రస్తావించగా, అక్కడ ఏఏ అంశాలు చర్చకు వస్తాయో తనకు తెలియదని మనోహర్ అన్నాడు. అయితే, పాక్‌తో సిరీస్ జరుగుతుందన్న ఆశ ఉందన్నాడు.