క్రీడాభూమి
రివర్స్ బిడ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, డిసెంబర్ 8: సహజంగా బిడ్స్‌లో ఎక్కువ మొత్తాన్ని కోట్ చేసిన వారికే కాంట్రాక్టు లభిస్తుంది. అయితే, రివర్స్ బిడ్ విధానం దీనికి భిన్నంగా ఉంటుంది. ముందుగానే బిడ్స్‌కు గరిష్ట పరిమితిని నిర్ణయిస్తారు. కాంట్రాక్టు కోరుకునే వారంతా అంతకు మించకుండా మొత్తాలను కోట్ చేయాల్సి ఉంటుంది. తక్కువ మొత్తం కోట్ చేసిన వారికే కాంట్రాక్టు దక్కుతుంది. ఐపిఎల్‌లో తాత్కాలికంగా రెండు ఫ్రాంచైజీల కోసం ఈ విధానానే్న అనుసరించారు. 40 కోట్ల రూపాయలను సీలింగ్‌గా నిర్ణయించారు. తక్కువ మొత్తాన్ని కోట్ చేసిన పుణె, రాజ్‌కోట్ ఫ్రాంచైజీలకు ఐపిఎల్‌లో చోటు దక్కింది. తక్కువ ధరను పేర్కోవడమంటే రూపాయో లేక పది రూపాయలో కోట్ చేయవచ్చుకదా అన్న ప్రశ్న తలెత్తవచ్చు. అయితే, ఫ్రాంచైజీ నిర్వాహణ, ఇతర ఖర్చులను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఖర్చులను ఎంతగా నియంత్రీకరించుకొని, సహేతుకమైన వివరణలతో బిడ్‌ను కోట్ చేస్తే, కాంట్రాక్టు పొందడానికి అంత ఎక్కువగా అవకాశాలు ఉంటాయి.