క్రీడాభూమి

‘ప్లేయర్ ఆఫ్‌ది ఇయర్’ మారిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, డిసెంబర్ 8: ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (డబ్ల్యుబిఎఫ్) ప్రతి సంవత్సరం ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే అవార్డు మహిళల విభాగంలో కరోలినా మారిన్‌కు దక్కింది. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తీవ్రంగా పోటీపడినప్పటికీ, అవార్డును మారిన్ ఎగరేసుకుపోయంది. ఈ ఏడాది సైనా నెహ్వాల్ నిలకడగా రాణించడంతో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కొంత కాలం అగ్రస్థానంలో నిలువడంతో ఆమె ఈ అవార్డుకు నామినేట్ అయింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్న సైనా నెహ్వాల్ ఈ అవార్డు కోసం స్పెయిన్‌కు చెందిన ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో పాటు 2014లో ఈ అవార్డును గెలుచుకున్న జావో యున్‌లెయి (చైనా), బావో ఇక్సిన్ (చైనా)లతో పోటీ పడింది. ఈ ఏడాది బిడబ్ల్యుఎఫ్ వరల్డ్ సూపర్ సిరీస్‌లో టూర్‌లో భాగంగా ఢిల్లీలో జరిగిన పోటీల్లో సైనా నెహ్వాల్ విజేతగా నిలువడంతో పాటు డబ్ల్యుబిఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్, ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్, చైనా ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఏడాది అత్యుత్తమ
ఫామ్‌ను
కొనసాగించిన మారిన్‌కు అవార్డు దక్కింది. అద్భుత విజయాలతో ప్రారంభించి ఈ ఏడాదిని ఎంతో ఘనంగా ముగించిన మారిన్ మార్చి నెలలో ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌ను, నవంబర్‌లో హాంకాంగ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కూడా నిలబెట్టుకుని మరో మూడు చిన్నచిన్న టైటిళ్లు గెలుచుకుంది. ఈ కారణంగానే ఆమెకు అవార్డు లభించింది. సైనాకు నిరాశే మిగిలింది. కాగా, మారిన్, సైనాలతో పోటీపడిన జావో విషయానికొస్తే, మహిళల డబుల్స్ విభాగంలో ఆమె ప్రముఖ క్రీడాకారిణిగా కొనసాగుతున్నది. సూపర్ సిరీస్ టోర్నీల్లో జంగ్ నాన్‌తో కలసి ఆరు మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్లను కైవసం చేసుకోవడంతో పాటు మిక్స్‌డ్, మహిళల డబుల్స్ విభాగాల్లో మరోసారి రెండు చాంపియన్‌షిప్‌లను, జపాన్, హాంకాంగ్ ఓపెన్ టోర్నీల్లో మహిళల డబుల్స్ టైటిళ్లను గెలుచుకుని ఈ ఏడాది మొత్తం ఎనిమిది సూపర్ సిరీస్ టైటిళ్లను తన ఖాతాలో జమచేసుకుంది. అలాగే డబ్ల్యుబిఎఫ్ అవార్డు కోసం పోటీ పడుతున్న మరో చైనా క్రీడాకారిణి బావో ఈ ఏడాది ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్స్‌లో మహిళల డబుల్స్ టైటిల్‌ను, ఇండియా ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్స్, ఆస్ట్రేలియా ఓపెన్, హాంకాంగ్ ఓపెన్ టోర్నీల్లో మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్స్‌కు చేరుకుంది. కాగా, ఈ ఏడాది డబ్ల్యుబిఎఫ్ ఉత్తమ క్రీడాకారుడి అవార్డు ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ చెన్ లాంగ్ (చైనా)కు లభించింది. అతనితో కలసి డబుల్స్‌లో ఆడే జాంగ్ నన్ (చైనా), కొరియా ఆటగాళ్లు లీ యంగ్ డే, యూ ఇయోన్ సియోంగ్ కూడా అవార్డుకు పోటీపడ్డారు కానీ, న్యాయనిర్ణేతలను చెన్ లాంగ్‌వైపే మొగ్గు చూపారు.
పోరాటం సాగిస్తా: సైనా
బిడబ్ల్యుఎఫ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో పోరాటం సాగిస్తానని సైనా చెప్పింది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈటోర్నీలో జపాన్‌కు చెందిన నొజొమీ ఒకుహరాతో తన పోరు మొదలవుతుందని విలేఖరులతో మాట్లాడుతూ చెప్పింది. టైటిల్ సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపింది.