క్రీడాభూమి

నాదల్-ఫెదరర్ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ఈ శతాబ్దంలోనే అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్న రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ మధ్య మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్నెషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపిటిఎల్)లో భాగంగా న్యూఢిల్లీలో వీరిద్దరి మధ్య పోరు ఉంటుంది. ఈ టోర్నమెంట్‌లో పలువురు మేటి టెన్నిస్ స్టార్లు ఆడుతున్నారు.

మహిళల ప్రపంచ స్క్వాష్ రద్దు
కౌలాలంపూర్, డిసెంబర్ 9: కౌలాలంపూర్‌లో శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన మహిళల స్క్వాష్ ప్రపంచ చాంపియన్‌షిప్ రద్దయింది. ప్రొఫెషనల్ స్క్వాష్ అసోయేషన్ (పిఎస్‌ఎ), టోర్నీ ప్రమోటర్ హల్‌మార్క్ కంపెనీ, మలేసియా ప్రభుత్వం మధ్య తలెత్తిన అభిప్రాయభేదాలే టోర్నీ రద్దుకు కారణమని అంటున్నారు. చైరోలో జరగాల్సిన పురుషుల ప్రపంచ చాంపియన్‌షిప్ భద్రతా కారణాలతో రద్దుకాగా, ఇప్పుడు మహిళల విభాగానికీ అదే పరిస్థితి ఎదురైంది. కౌలాలంపూర్‌లో టోర్నీ నిర్వాహణకు భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని హల్‌మార్క్ అధికారులు ప్రకటించగా, మలేసియా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కౌలాలంపూర్‌లో భద్రత గురించిన సమస్యలేవీ లేవని మలేసియా ప్రధాని నజీబ్ రజాక్, క్రీడాశాఖ మంత్రి ఖైరీ జమాలుద్దీన్ స్పష్టం చేశారు. ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్లే హల్‌మార్క్ సంస్థ పోటీలను నిర్వహించడం లేదని, అయితే, తప్పును కప్పిపుచ్చుకోవడానికి అర్థంలేని ప్రకటనలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. టోర్నీ నిర్వాహణ, భద్రతకు అవసరమైన సొమ్ము లేకపోవడంతో, ఆ మొత్తాన్ని భరించాల్సిందిగా తమను కోరారని వివరించారు. ప్రమోటర్‌గా పిఎస్‌ఎతో ఒప్పందం కుదుర్చుకొని, చివరి క్షణాల్లో చేతులెత్తేసిన హల్‌మార్క్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. ఇలావుంటే, ప్రపంచ చాంపియన్‌షిప్ రద్దు విషయాన్ని పిఎస్‌ఎ అధికారికంగా తన వెబ్‌సైట్‌లో ప్రకటించలేదు. మలేసియా సర్కారుకు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని ఇచ్చింది. మొత్తం మీద అటు పురుషులు, ఇటు మహిళల విభాగాల్లో ప్రపంచ చాంపియన్‌షిప్ రద్దుకావడంతో స్క్వాష్ అభిమానులు నిరాశకు గురయ్యారు.