క్రీడాభూమి

అరోన్ కెప్టెన్సీలో ఆడనున్న ధోనీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, డిసెంబర్ 8: టి-20, వనే్డ ఫార్మెట్స్‌లో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఈనెల 10 నుంచి 18వ తేదీ వరకూ జరిగే విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో వరుణ్ ఆరోన్ కెప్టెన్సీలో మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జార్ఖండ్ జట్టులో ధోనీని చేర్చారు. ఈ టోర్నమెంట్‌లో ఆడేందుకు అతను సంసిద్ధత వ్యక్తం చేశాడని, అందుకే అతని పేరును జాబితాలో చేర్చామని జార్ఖండ్ క్రికెట్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. జట్టుకు వరుణ్ ఆరోన్ నాయకత్వం వహిస్తాడని పేర్కొంది. కాగా, జార్ఖండ్ తరఫున ధోనీ చివరిసారి 2007లో సయ్యద్ ముస్తాక్ అలీ టి-20 చాంపియన్‌షిప్‌లో ఆడాడు. ఆతర్వాత అతను దేశవిదేశాల్లో వివిధ షెడ్యూళ్లతో తీరిక లేకుండా ఉండడంతో దేశవాళీ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈనెల పాకిస్తాన్‌తో సిరీస్ లేకపోతే అతను హజారే టోర్నీలో పాల్గొంటాడని జార్ఖండ్ క్రికెట్ అధికారులు ప్రకటించారు.