క్రీడాభూమి

మా లక్ష్యం క్లీన్‌స్వీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోబర్ట్, డిసెంబర్ 9: వెస్టిండీస్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అన్నాడు. విండీస్‌పై 3-0 తేడాతో గెలుపొంది, క్లీన్‌స్వీప్ సాధించడమే తమ లక్ష్యమని అన్నాడు. నాథన్ కౌల్టర్ నైల్‌ను కాదని జేమ్స్ పాటిన్సన్‌కు తుది జట్టులో అవకాశం కల్పించడాన్ని అతను సమర్థించుకున్నాడు. కెరీర్‌లో మొత్తం 13 టెస్టులు ఆడిన పాటిన్సన్ చివరి టెస్టును 2014 మార్చిలో ఆడాడు. కండరాలు బెణకడం, వెన్నునొప్పి దీర్ఘకాల సమస్యలతో అతను చాలాకాలంగా జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నాడని, అన్ని అంశాలు కలిసొస్తే అతను గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగలుగుతాడని చెప్పాడు. స్ట్రయిక్ బౌలర్‌గా సేవలు అందించే సత్తా ఉన్న అతనికి తుది జట్టులో స్థానం కల్పించడంలో ఎలాంటి పొరపాటు లేదన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ విజయాలను తలచుకుంటూ విండీస్‌ను తక్కువ అంచనా వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశాడు. ఆ జట్టులో సమర్థులు చాలా మంది ఉన్నారని చెప్పాడు. ఇరు జట్ల బలగాలు సమానంగా కనిపిస్తున్నాయని, కాబట్టి పోటీ తీవ్రంగా ఉంటుందని స్మిత్ జోస్యం చెప్పాడు.
తొలి టెస్టుకు విండీస్ జట్టు
స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, జో బర్న్స్, ఆడం వోగ్స్, షాన్ మార్ష్, మిచెల్ మార్ష్, పీటర్ నెవిల్, పీటర్ సిడిల్, జొష్ హాజెల్‌వుడ్, జేమ్స్ పాటిన్సన్, నాథన్ లియాన్.
12వ ఆటగాడు: నాథన్ కౌల్టర్ నైల్.

ఎనిమిదేళ్ల తర్వాత..
దేశవాళీ పోటీలకు సిద్ధమైన ధోనీ
ఆలూర్ (కర్నాటక), డిసెంబర్ 9: భారత టి-20, వనే్డ జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి దేశవాళీ పోటీల్లో పాల్గొననున్నాడు. గురువారం నుంచి మొదలయ్యే విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ తరఫున ఆడనున్న అతను మొదటి మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్‌తో తలపడతాడు.
కోహ్లీకి విశ్రాంతి
హజారే టోర్నీ నుంచి భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించాడు. అయితే, శిఖర్ ధావన్, ఇశాంత్ శర్మ తదితరులు బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరూ ఢిల్లీ తరఫున బరోడాతో తొలి మ్యాచ్ ఆడతారు.