క్రీడాభూమి

ఫ్యూరీ బెల్ట్ వెనక్కి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, డిసెంబర్ 9: గత నెల 28న జరిగిన టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ వ్లాదిమీర్ క్లిచ్కోను ఓడించిన బ్రిటిష్ హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్ టైసన్ ఫ్యూరీ తనకు లభించిన బెల్ట్స్‌లో ఒకదానిని కోల్పోనున్నాడు. క్లిచ్కోపై సంచలన విజయాన్ని నమోదు చేసిన అతనికి డబ్ల్యుబిఎ, ఐబిఎప్, ఐబిఓ, డబ్ల్యుబివో బెల్ట్‌లు లభించాయి. అయితే, అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఐబిఎఫ్) నిబంధనలను అనుసరించి అతను చాలెంజర్ వ్యాచెస్లావ్ గాజ్‌కోవ్‌తో తలపడాల్సి ఉంది. అయితే, అతను అందుకు భిన్నంగా క్లిచ్కోతో రీ మ్యాచ్‌కి సంసిద్ధత వ్యక్తం చేశాడు. ఫలితంగా ఐబిఎఫ్ బెల్ట్‌ను అతను వెనుక్కు ఇచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాము సూచించిన చాలెంజర్ గాజ్‌కోవ్‌కాగా, క్లిచ్కోతో రీ మ్యాచ్‌కి ఫ్యూరీ కాంట్రాక్టు కుదుర్చుకున్నాడని ఐబిఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. అందుకే అతని వద్ద ఉన్న ఐబిఎఫ్ టైటిల్‌ను వెనక్కు తీసుకుంటామని ప్రకటించింది.

బిడబ్ల్యుఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్
సైనా, శ్రీకాంత్
పరాజయం

దుబాయ్, డిసెంబర్ 9: అంతర్జాతీయ బాడ్మిం టన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) సూపర్ సిరీస్ ఫైన ల్స్ టోర్నమెంట్‌లో పతకాలు సాధించే అవకాశా లు ఎక్కువగా ఉన్నాయనుకున్న భారత షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ మొదటి రౌండ్ లో మ్యాచ్‌లను పరాజయాలతో మొదలు పెట్టా రు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి సైనాపై జపాన్‌కు చెందిన నొజోమీ ఒ కుహరా 21-14, 21-6 తేడాతో సునాయాసంగా గెలిచింది. సైనా నుంచి ఏ దశలోనూ ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో ఈ మ్యాచ్ కేవలం 35 ని మిషాల్లోనే ముగిసింది. ఇదే గ్రూప్‌లో గురువా రం జరిగే మరో మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ వన్ కరోలినా మారిన్‌ను సైనా ఎదుర్కొంటుంది. గ తంలో మారిన్‌ను పలు సందర్భాల్లో ఓడించిన సై నా ఇటీవల కాలంలో ఆమెను అధిగమించలేక పోతున్నది. దీనితో లీగ్ దశలో రెండో మ్యాచ్‌లో ఆమె మారిన్‌ను ఎంత వరకూ కట్టడి చేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయ. ఇలావుంటే, పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో శ్రీకాంత్ 13-21, 13-21 తేడాతో కెన్టో మొమొతా చేతిలో ఓ టమిపాలయ్యాడు. సైనాతో పోలిస్తే శ్రీకాంత్ గొ ప్పగా పోరాడినప్పటికీ, మొమొతా వేగాన్ని, వ్యూ హాన్ని అందుకోలేకపోయాడు. అతను గురువా రం నాటి మ్యాచ్‌లో అతను డెన్మార్క్‌కు చెందిన విక్టర్ ఎక్సెల్సెన్‌తో తలపడతాడు. ప్రపంచ మేటి ఆటగాళ్లకు కూడా గట్టిపోటీని ఇవ్వగల సత్తావు న్న శ్రీకాంత్‌కు విక్టర్‌పై విజయాన్ని నమోదు చేసే అవకాశాలు లేకపోలేదు. అయతే, పోటీ తీవ్ర స్థా యలో ఉండడం ఖాయం.