S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ

01/26/2019 - 23:21

పశ్చిమాన ఆకాశం పండు ముత్తయిదువు లాగా హృద్యంగా ఉంది, అస్తమించే భానుడి వింత సోయగాన్ని సంతరించుకుని. యధాలాపంగా అటు దిక్కు చూసిన రంగారావు మనస్సు ఒక్క క్షణం తను పడుతున్న మనోవేదనను మరిచిపోయి, మురిసిపోయి, వూళ్లో వున్న తల్లిని గుర్తుకు తెచ్చింది.

01/19/2019 - 19:48

అతనప్పుడే అన్నం తిని బాల్కనీలోని మంచంమీద నడుం వాల్చాడు.
ఆరుబయట బాల్కనీలో అలా పడుకోవటం అంటే ఎంతిష్టమో రామారావుకి. కాంక్రీటు గోడల్లోపల ఊపిరి సలపదతనికి. బయటే వేయించుకుంటాడు మంచాన్ని. ఊర్లోని అలవాటు.

01/12/2019 - 19:42

‘అమ్మా! నేను అజయ్‌నే చేసుకుంటాను. ఉదయ్ వాళ్ల పేరెంట్స్‌తో చెప్పేస్తే మంచిదేమో!’ అమల మాటలకు అవాక్కయింది వింధ్య. అమల అమెరికా నుండి వచ్చిన నాలుగు రోజుల తరువాత బోర్ కొడుతూన్నదంటే దూరపు బంధువులను పరిచయం చేసినట్లు కూడ ఉంటుందని నాలుగు పల్లెటూర్ల ప్రయాణం పెట్టుకుని తిరిగి వచ్చారు. ఆ తరువాత కొద్ది రోజులకే తాను అమెరికా ఇక వెళ్లనని చెప్పింది.

01/05/2019 - 22:56

ఉలిక్కిపడ్డారంతా!
‘నేనన్నది, మీరు విన్నది.. అక్షరాలా నిజం..’ ముసిముసిగా నవ్వుతూ అయ్యగారు చెప్పిన మాటలకు.
అయ్యగారంటే జిల్లా స్థాయిలో కీలకమైన శాఖకు అధికారి. అయ్యగారు ఈ జిల్లాకు వచ్చిన ఉద్యోగ కాలం పూర్తి కావచ్చింది. నేడో రేపో బదిలీపై తప్పనిసరిగా వెళ్లాలి.

12/29/2018 - 23:10

రామశర్మ ఆయుర్వేద వైద్యుడు. ఎంతటి మొండి వ్యాధినైనా ఇట్టే తగ్గించగల మంచి నైపుణ్యం, హస్తవాసి గల వ్యక్తి. పట్నానికి దూరంగా ఉన్న చిన్న పల్లెటూరులో అతని నివాసం. ఆ ఊరులోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది వచ్చి తమ అనారోగ్యాలకు మం దులు తీసుకొనేవారు.

12/22/2018 - 19:44

బజాజ్ షోరూమ్ ముందు నిలబడున్నాడు భాస్కర్. అక్కడున్న రకరకాల మోడల్ల వాహనాలపై అతడి దృష్టి లేదు. డిస్‌ప్లేలో ఉంచిన ‘బ్లాక్ అండ్ రెడ్ పల్సర్’ మీదే స్థిరంగా ఉన్నాయి అతడి చూపులు. అతడు దాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడు. అది అందంగా, స్మార్ట్‌గా మనసును ఆకట్టుకునే విధంగా ఉంది. అది అతడికి ఎంతగానో నచ్చిన బండి.

12/15/2018 - 18:23

మనిషి మొదటి భావోద్వేగం - ఏడుపు. అందుకే అది కాకుండా మిగిలినవి సంపాదించుకోవాలి కానీ వేటినీ అంటిపెట్టుకుని ఉండకూడదు - గోవిందరావు మనస్తత్వంలో అన్ని భావోద్వేగాలూ పరిపూర్ణంగా వున్నాయి. అన్నింటి వ్యవధి లిప్తపాటే! పరిపూర్ణ వ్యక్తికి ప్రతిరూపంగా కన్పిస్తాడు. తనకు నచ్చినట్లే పెరిగాడు. తనకు నచ్చినట్టు తిరిగాడు. తనకు నచ్చినట్లే చేస్తున్నాడు. అన్నీ కూడా అతనిష్టమే!

12/08/2018 - 19:31

సికిందరాబాద్ రైల్వేస్టేషన్‌లో.. రైలు దిగి..
ఎదురొచ్చే జనాల్ని, వెంటపడే పోర్టర్లను దాటుకుని, స్టేషన్ బయటికొచ్చి నిలబడింది ప్రియంవద. అక్కడా ఆటోవాళ్లు చుట్టుముట్టారు. వాళ్లనీ కాదని... పైన ఎండ మాడుస్తున్నా.. అలానే నిలబడింది. పది నిమిషాల తరువాత ఊదారంగు పొడవాటి కారు వచ్చి ఆగింది ఆమె ముందు.

12/01/2018 - 22:08

‘హలో..! ఇందాకటి నుంచీ కాల్ చేస్తుంటే తీయవేరా?’ విసుక్కున్నాడు సుబ్రహ్మణ్యం.
‘చెప్పరా.. ఇంత పొద్దునే్న ఏంటంత కొంపలు మునిగిపోయే విషయం?’ ఆవులిస్తూ అన్నాను నేను.
‘పొద్దున్నా..? టైం పది గంటలైంది.. ఇంకా నిద్రపోతున్నావురా గాడిద?’
‘రాత్రి బాగగా లేటయ్యిందిలేగానీ.. మ్యాటరేంటో చెప్పు?’
‘నువ్వేదయినా జాబ్ చూడమన్నావు కదా.. దొరికింది’

11/24/2018 - 18:59

ఆ రోజు ఆదివారం. సునంద వరండాలో కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. వాతావరణం మరీ ఎండగానూ, మరీ చలిగానూ కాకుండా సమశీతోష్ణంగా ఉంది. సన్నగా గాలి వీస్తోంది. మెట్ల పక్కన పెట్టిన కుండీల్లోంచి పూల సువాసన గాలలో తేలివస్తోంది.

Pages