S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ

11/30/2019 - 23:37

హై దరాబాద్ మహానగరం డెబ్భైలక్షల జనాభాతో కిటకిటలాతుంది. వివిధ కులాలు, వివిధ మతాల, అనేక భాషా సమూహాల జనంతో భిన్నత్వంలో ఏకత్వానికి మరోపేరులా ఉంది. నగరంలో రద్దీగా వుండే స్థలాల్లో దిల్‌సుక్‌నగర్ ఒకటి. తీవ్రవాదుల బాంబు పేలుళ్ళకు గురైన దిల్‌సుక్‌నగర్ బస్టాండ్ ప్రాంతం జనం ఈనినట్టుగా ఉంది. ఆఫీసుకెళ్ళే సమయం కావడంవల్ల మరింత రద్దీగా ఉంది. సికిందరాబాద్‌కెళ్ళే ఒకటవ నెంబర్ సిటీ బస్సొచ్చి బస్టాపులో ఆగింది.

11/23/2019 - 23:49

శపథం చేసింది, చేసేది ఆడది కదా?! కాదు. ఆ శపథం చేసింది సుబ్బారావు. ఆశ్చర్యంగా ఉంది కదూ. మగవాడేంటి మంగమ్మ శపథం ఏమిటి? చూద్దాం!

11/16/2019 - 23:39

నేస్తం...

11/09/2019 - 19:00

‘మన పెళ్లై ఇంకా సంవత్సరం కూడా నిండలేదు. అప్పుడే ఏమిటీ గొడవలు?’ అన్నాడు శ్రీనివాసరావు.
‘అన్నిటికీ కారణం మీ అమ్మ’ అంది నాగశ్రీ.
‘నేనేం చేశానమ్మా?’ అంది రమణమ్మ.
అత్త రమణమ్మ వైపు తిరిగి ‘చేసేదంతా చేసి నంగనాచిలా నటించకు!’ అని, భర్త శ్రీనివాసరావు వైపు తిరిగి ‘నీ తల్లికి నా మీద అనుమానం. ఇంకా ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ నన్ను సాధిస్తుంది’ అంది నాగశ్రీ.

11/02/2019 - 19:55

హిమగిరి బ్యాంక్ లిమిటెడ్, బాలకనకపురం బ్రాంచికి అది ప్రతిరోజూ లాగా మరొక వర్కింగ్ డే. కానీ ఆ రోజు మిగిలిన రోజుల్లాగా ఉండబోవట్లేదని ఆ రోజు ఉదయం అందులోకి అడుగు పెడుతున్న బ్రాంచ్ మేనేజర్ గోపాలరావుకి ఆ క్షణంలో తెలియదు.

10/26/2019 - 18:59

బిజినెస్ మాగ్నెట్ హర్షవర్థన్ తన ఆఫీసులో అసహనంగా అటు ఇటూ తిరుగుతున్నాడు. పిఏ వచ్చింది కొన్ని ముఖ్యమైన ఫైల్స్ మీద సంతకాలు తీసుకుంది. అన్యమనస్కంగానే సంతకాలు పెట్టాడు. ఆమె హర్షవర్థన్ వైపు చూస్తూ ఎనీ ప్రాబ్లం సర్.. వినయంగా అడిగింది. ‘నో యు కెన్ గో’ చిరాగ్గా అన్నాడు. వెంటనే ఆమె ఆ చాంబర్ నుండి బయటికి వచ్చేసింది.

10/19/2019 - 18:58

పచ్చని కొబ్బరి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఆంధ్రా గోవా అనిపించే, కోనసీమలోని గోదావరి గట్టునున్న ఓ కుగ్రామం దొడ్డవరం. ఇప్పటికీ వరద వస్తే చుట్టూ మునిగిపోయి లోపలికి వెళ్లాలంటే మూడు మైళ్లు పైనే పడవ ప్రయాణం చేయవలసిందే.

10/12/2019 - 18:24

ఉస్మానియా యూనివర్సిటీలో బి.టెక్ చేసిన తరువాత, ఇండియన్ సిలికాన్ వ్యాలీ అనబడే బెంగుళూర్ వచ్చి, ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా చేరి, రెండు ప్రమోషన్లు సంపాదించి, గ్రూప్ మేనేజర్‌గా పని చేస్తున్నాను. జీవితంలోనూ రెండు ప్రమోషన్లు సంపాదించాను. బ్రహ్మచారి అనే స్టేజీలోంచి, వివాహితుడనై, ఇద్దరు ఆడపిల్లలకు తండ్రి అయ్యాను.

10/05/2019 - 19:11

రాయేలమ్మ చనిపోయే నాటికి ఎనే్నళ్లో తెలియదు. అప్పటికే ఆమె భర్త గతించాడు.
ఆమె తన పదమూడో ఏట నించి నలభై అయిదో ఏటి దాకా పనె్నండు మంది పిల్లలకు తల్లి అయింది.
ఆమె పెద్ద కొడుక్కు ముప్పై ఏళ్లున్నప్పడు, ఆమె చివరి కొడుకు పుట్టాడు. ఆమె కడుపుడికింది.
తన పెద్ద మనుమడికి పనె్నండేళ్లు. తన చిన్న కొడుక్కు ఏడాది దాటింది.

09/28/2019 - 18:59

చాలా రోజుల తర్వాత నేను రవిని కలిశాను. ‘చాలా రోజుల తర్వాత’ అని అంత పర్టిక్యులర్‌గా చెప్పటంలో నా ఉద్దేశం ఏమిటో మీకు నిదానంగా అవగతమవుతుంది. రవి మాటకారి కాదు. అలా అని బిడియస్థుడు కూడా కాదు. మితభాషి. అవసరమైనప్పుడు అవసరమైనంత మేరకే అతడి సమాధానం ఉంటుంది.

Pages