S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ

03/30/2019 - 19:56

ఆ దృశ్యాలు చూసినప్పటి నుండి తన చిన్ననాటి సంఘటనలు ఒంటి రెక్క సీతాకోక చిలుకలై కౌశల్ కనురెప్పలపై వాలుతూనే ఉన్నాయ్.
ఎన్నిసార్లు? చెరిపే ప్రయత్నం చేసినా! ఆ దృశ్యాలు నేరుగా కళ్లల్లోకి ఇంకిపోయి గుండెను గుచ్చేస్తున్నాయి.
విశాలమైన ఏసీ గది చల్లటి గాలిని తింటోంది.
మరో పక్క సమయం పడమర గోడపై నుండి రాలుతోంది.

03/23/2019 - 19:29

చిన్నారావు వయసు పది వసంతాలు. వాడు చదువుతున్నది ఐదవ తరగతి. ఆ చదవడం ఒక అశ్వమేధ యాగం చేయడం లాంటిది. ఒకరోజు వాళ్ల సోషల్ స్టడీస్ మాస్టారు వాడిని భారతదేశపటం కొనమన్నారు. కొని, దానికి రంగులు పూసి తెమ్మన్నారు. ఆ దేశ పటం ఖరీదు 10 పైసలు. అడిగితే లేదు పొమ్మన్నాడు వాడి నాన్న, రిక్షా లాగే నాగన్న. అప్పుడిక చిన్నారావు అమ్మను వేధించగా, లచ్చమ్మ నాలుగు చీవాట్లు వేసి పది పైసలూ ఇచ్చింది. దేశపటమూ వచ్చింది.

03/16/2019 - 18:42

‘వేట, వేటకాని యొక్క ఘనతను గురించిన ఆఫ్రికన్ సామెత నొకదానిని తెలుసుకున్నాక, వేట, వేటకాని యొక్క గుణగణాలను గురించిన కథనొకటి చెబుతున్నాను. వినండి’ అన్నారు రుష్యో.

03/09/2019 - 20:59

ఎప్పుడో ఏమో గానీ ఇప్పుడైతే దిస్ సెపరేషన్ ఫెన్సింగ్ ఎల్వో సీ నాట్ బిట్వీన్ టూ కంట్రీస్.. ఇట్ బిట్వీన్ జస్ట్ టూ లవబుల్ హార్ట్స్...
* * *

02/23/2019 - 19:55

జీవితంలో మన ప్రమేయం లేకుండా, మనకి ఇష్టం లేకున్నా కొన్ని సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి. ఆ సంఘటనలకి ఎంత కుమిలిపోయినా చేజారిపోయిన జీవితం తిరిగి రాదు. పడిన మచ్చ తొలగిపోదు. అటువంటి జీవితాన్ని తలుచుకుంటే దుఃఖం వస్తుంది. మనస్సుకి కష్టం కలుగుతుంది. దానిని ఎదుర్కొని సిస్సాహతం ఎంత కన్నీరు కార్చినా తరగని వేదన. ఏ రకంగా తిరిగి పొందలేని నష్టం.

02/16/2019 - 19:43

‘ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలీటం లేదక్కా!’ నెత్తి కొట్టుకున్నాడు రాఘవ.

02/09/2019 - 19:53

అప్పటిదాకా చండప్రచండమై జగతిని దడదడలాడించిన పగటి రేడు తనంతట తానే రేరాజుకి తలొంచి.. దూరానె్నక్కడో నిష్క్రమిస్తున్న దృశ్యం తాలూకు హరివిల్లు అక్కడంతా వ్యాపించి ఉంది. అప్పుడప్పుడే అల్లరి పిల్లగాలులు చల్లదనాన్ని మెల్లమెల్లగా వెదజల్లుతున్నాయి.. అక్కడంతా. ఆ అందంలో మేమూ భాగమేనన్నట్టు ఒక్కొక్కటిగా, గుంపులు గుంపులుగా గువ్వలు గూడు చేరుతున్నాయ్. ఆ రెక్కల చప్పుళ్ళల్లో ఏదో ఊహల కందని ఉత్సాహం.

02/02/2019 - 18:29

వివేక్ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆఫీసులో ఎంతో మంచి పేరు ఉన్న వ్యక్తి వివేక్. అతని భార్య నీలిమ కూడా చాలా మంచి అమ్మాయి. భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. అటువంటిది ఆ కుటుంబంలో జరిగిన ఆ సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
విషయం తెలియడంతో వివిధ టీవీ ఛానల్ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. పలు మహిళా సంఘాల సభ్యులు, అభ్యుదయ వాదులు అక్కడికి వాలిపోయారు.

01/26/2019 - 23:21

పశ్చిమాన ఆకాశం పండు ముత్తయిదువు లాగా హృద్యంగా ఉంది, అస్తమించే భానుడి వింత సోయగాన్ని సంతరించుకుని. యధాలాపంగా అటు దిక్కు చూసిన రంగారావు మనస్సు ఒక్క క్షణం తను పడుతున్న మనోవేదనను మరిచిపోయి, మురిసిపోయి, వూళ్లో వున్న తల్లిని గుర్తుకు తెచ్చింది.

01/19/2019 - 19:48

అతనప్పుడే అన్నం తిని బాల్కనీలోని మంచంమీద నడుం వాల్చాడు.
ఆరుబయట బాల్కనీలో అలా పడుకోవటం అంటే ఎంతిష్టమో రామారావుకి. కాంక్రీటు గోడల్లోపల ఊపిరి సలపదతనికి. బయటే వేయించుకుంటాడు మంచాన్ని. ఊర్లోని అలవాటు.

Pages