S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ

06/15/2019 - 18:13

అన్నప్రాశన మహోత్సవం. బోర్లాపడుకున్న ఏడు నెలల స్రవంతి తలెత్తి ఎదురుగా బంగారునగలు, నోట్ల కట్టలవైపు చూసింది. చూపు మరల్చి ప్రక్కనే వున్న పుస్తకం, పెన్ను, చాకు, పూలదండ వైపు దృష్టి సారించింది. వాటి వెనుక నిలబడి. ‘‘రావాలి.. రావాలి.. చిట్టితల్లి’’ అని చేతులూపుతూ పిలుస్తున్న అమ్మ నాన్నలను చూస్తూ చేతులు నేలపై ఆన్చి పాదాలు పైకెత్తి పాకడం మొదలుపెట్టింది.

06/08/2019 - 19:48

మనోల్లాసాన్నిచ్చే కథలు ఎప్పటికీ పాతబడవు. ఎంతోకాలం నుంచీ వున్నా, వింటున్నా ప్రతీరోజూ కొత్తగానే ఉంటాయి. ఎక్కడో వెలుగునీడలమధ్య ఓ చిన్న గ్రామం. ఆ గ్రామంలోని ఒక సేఠ్ కథే ఇది. ఇతను అత్యంత ధనికుడు. చంద్రుడు లేని రాత్రి మెరిసే లెక్కలేనన్ని నక్షత్రాలన్ని ధనరాసులున్నాయి. అష్టదిక్పాలకులూ అతని యింటి రక్షకులుగా వున్నారేమోననిపిస్తుంది. అంతెందుకు, ఆయన భార్య సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమనిపిస్తుంది.

06/03/2019 - 21:56

మాధవరావు ఆ ఫ్లాట్‌లో కొత్తగా దిగాడు. ఆ రోజు కూడా తలుపు తెరచి ఆఫీసుకెళ్లే హడావిడిలో బయటకొచ్చిన ఆయనకి ఎదురింట్లోంచి కిలకిలా నవ్వులు, సంభాషణలు వినిపించాయి - ఎప్పటిలానే!
‘ఎంత అందమైన నవ్వు! ఆ నవ్వుల పువ్వును కట్టుకున్న అదృష్టవంతుడెవరో?’
మరికాసేపు ఆగి వినాలనిపించింది ఆ నవ్వును. అది సభ్యత కాదని తెలుసు. కానీ మది కోరింది ఆ నవ్వు మళ్లీమళ్లీ వినమని.

05/25/2019 - 19:25

‘అమ్మా... వైష్ణవీ! ఈ రోజు మీ మాస్టారు కనిపించార్రా! నువ్వు డాక్టరువి అవుతానన్నావట కదా! ఆయన ఆ విషయం చెప్పి, నువ్వు కచ్చితంగా సాదిత్తావని, ఈలైతే చదివించమని చెప్పారు. కలాసులో నువ్వే పస్టట కదా! నిన్ను డాక్టరు చదివించేంత తోమత మీ నాన్నకు, నాకూ లేదు గాని, నువ్విప్పుడు ఆరో తగతే కదా తల్లీ! నువ్వు డాక్టరు చదివే వయసు వచ్చేటప్పటికి చదివించగలిగే తితికి వత్తామేమో చూద్దాం!

05/18/2019 - 20:38

గోపాల్, ఆనంద్ ఇద్దరూ ఇంటర్‌మీడియెట్ ఒకే కాలేజీలో చదువుతున్నారు. గోపాల్ తండ్రి రాఘవరావు, ఆనంద్ తండ్రి శంకరయ్య కూడా ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. రాఘవరావు ఆఫీసరు అయినా శంకరయ్య గుమాస్తాగా చేస్తున్నా చిన్న, పెద్ద అనే తేడాలు లేకుండా ఇద్దరూ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండేవారు.
ఒకరోజు లంచ్ అవర్‌లో శంకరయ్య ఇలా అన్నాడు.

05/18/2019 - 20:04

ఒక రాతికి శిల్పవిద్య ఎంతో, మనిషి ఆత్మకు చదువు అంటే - జోసెఫ్ అడిసన్
* * *

05/11/2019 - 19:37

‘మంజీ’ అన్నాడు మృదువుగా అంజి.
‘ఊఁ’ అంది మత్తుగా మంజి అతని కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ.

05/04/2019 - 17:42

ఆ రోజు పోస్ట్ వచ్చిన ఉత్తరం దయానిధి మాస్టారి మనసుని పెద్దగాయమే చేసింది. పడకకుర్చీలో కూర్చున్న ఆయన చేతిలో రెపరెపలాడుతున్న ఉత్తరంలాగే ఆయన మనసు కూడా రెపరెపలాడసాగింది. ఏమిటో వెధవబుద్ధి. లోకంలో ఎవరు ఎలా పోతే మనకెందుకు అనుకోలేకపోతున్నాడు తను. తెలుసున్నవాడు, తన దగ్గర చదువుకున్నవాడు, తన మాట వింటాడు, తన అభిమానాన్ని పొందినవాడు, తనని అభిమానించేవాడు.. ఇన్ని అనుకుని సలహా ఇచ్చాడే తప్ప మరో ఉద్దేశంతోనూ కాదు.

04/27/2019 - 20:18

శాంతకుమార్ జగిత్యాల జిల్లా ఏసిబి డీఎస్పీ రాజీవ్ మీనన్‌ని ఆఫీసులో పర్సనల్‌గా కలిశాడు.
చూస్తున్న ఫైలు మూసేసి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని సైగ చేశాడు డీఎస్పీ. ఆ అధికారితో ఏదో సంభాషిస్తున్న అసిస్టెంట్, శాంతకుమార్ రాకతో వెళ్లిపోయాడా గది నుంచి.
కళ్లద్దాల్ని సవరించుకుంటూ ‘వాట్స్ యువర్ ప్రాబ్లమ్’ ప్రశ్నించాడు డీఎస్పీ.

04/20/2019 - 19:49

‘అమ్మని ఒక్కదానే్న వదిలి రాలేనంటే ఎలా? మరి అమెరికా వెళ్లి ఎమ్మెస్ ఎందుకు చేసినట్టు? ఇక్కడ చిన్నచిన్న ఉద్యోగాలు చేయటానికా?’ భర్త వేణుని నిలదీసింది కళ్యాణి.

Pages