S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ చిన్నమాట!

12/03/2016 - 23:35

నేను మా అమ్మాయి ఆల్బమ్ తిరగేస్తుంటే నేను ఓ మీటింగ్‌లో పాల్గొన్న ఫొటో కనిపించింది. నా పక్కన ఓ యువకుడు కూర్చొని ఉన్నాడు. అతను కాళ్లు బాగా చాపి కూర్చున్నాడు. ‘ఇంత నిర్లక్ష్యంగా ఉన్న వ్యక్తి ఎవరు?’ అని మా అమ్మాయి అడిగింది. ఆ కుర్రవాడు చాలా మంచివాడని చెప్పడానికి కొంత సమయం పట్టింది.

12/03/2016 - 21:04

వయస్సుతో నిమిత్తం లేకుండా కొంతమంది చాలా హుషారుగా ఉంటుంటారు. స్పోర్ట్స్ షూస్ వేసుకొని, టీషర్ట్‌లు వేసుకుని కూడా కన్పిస్తుంటారు. మీసాలకి, తల వెంట్రుకలకి రంగు వేసుకొని కూడా దర్శనం ఇస్తుంటారు. వాళ్ల వయస్సు ఓ పది నుంచి ఇరవై సంవత్సరాలు తగ్గినట్టుగా కూడా కన్పిస్తుంటారు. వాళ్లు తమ యుక్తవయస్సులో కూడా అంత శ్రద్ధ తీసుకొని ఉండరు.

11/20/2016 - 00:32

పత్రికా మిత్రులు ఎక్కువగా ఉపయోగించే పదం డెడ్‌లైన్. తెలుగులో దాన్ని మనం చివరి గడువు అంటాం. పత్రికలో ఆదివారం అనుబంధం పేజీలు ముగించడానికి ఓ చివరి గడువు ఉంటుంది. అదే విధంగా ప్రతీ పత్రికకి చివరి గడువు ఉంటుంది. వార్తలకి కూడా చివరి గడువు ఉంటుంది. ఆ చివరి గడువు తరువాత పత్రిక ప్రచురణకి వెళ్లిపోతుంది. సంపాదకీయానికి అంతే. చివరి గడువు లేనిదంటూ ఏమీ ఉండదు. ఆ చివరి గడువు తరువాత ఆ వార్తకి విలువ ఉండదు.

11/12/2016 - 20:48

చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర పుస్తకాలు ఎక్కువగా చదివేవాణ్ని. కాస్త పెద్ద అయిన తరువాత యువ, భూమి, జ్యోతి లాంటి పత్రికలు చదివేవాణ్ని. మా రఘుపతన్నకి సాహిత్యం అంటే మక్కువ. శ్రీశ్రీ, దాశరథి, నారాయణరెడ్డి, కాళోజీ లాంటి కవిత్వ పుస్తకాలతోబాటూ, చలం, బుచ్చిబాబు, శ్రీపాద, రంగనాయకమ్మల పుస్తకాలు లెక్కలేనన్ని వుండేవి.

11/05/2016 - 23:54

మా క్లాస్‌మేట్స్ చాలామంది రూంలు తీసుకొని కరీంనగర్‌లో చదువుకునేవారు. అప్పుడు ఇన్ని హాస్టల్స్ లేవు. అందుకని వాళ్లు రూంలలో ఉండేవాళ్లు. వంట వాళ్లే వండుకునేవాళ్లు. నాకు అలాంటి పరిస్థితి రాలేదు. ఎందుకంటే కరీంనగర్‌లో మా రాధక్క ఉండేది. ఆమె దగ్గర ఉండటం వల్ల వంట అన్నది అవసరం పడలేదు.

10/28/2016 - 23:15

ఓ రోజు ఉదయం మా ఇంటి దగ్గర్లో వున్న హోటల్‌కి వెళ్లాను. అక్కడ సెల్ఫ్ సర్వీస్. మనమే తెచ్చుకొని తినాలి. టీ కూడా అంతే. టీ వాసన గుప్పుమన్నది. టీ చాలా బాగుంది. వెంటనే ఆ విషయం టీ తయారుచేస్తున్న వ్యక్తికి చెప్పాను. అతని మొఖం విప్పారింది. ఎప్పుడు అక్కడికి వెళ్లినా అతను ఆనందంగా పలకరిస్తాడు. మంచి టీ తయారుచేసి ఇస్తాడు.

10/23/2016 - 00:53

ఓ రెండు సంవత్సరాల క్రితం ఓ సాహిత్య కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చింది. అది కేంద్ర సాహిత్య అకాడెమీ వాళ్లు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమం. చాలా రాష్ట్రాలకి చెందిన కవులూ రచయితలు పాల్గొంటున్న కార్యక్రమం.

10/15/2016 - 21:37

పెళ్లి తరువాత కూడా పిల్లలు తమ దగ్గరే ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అది సహజం. కొడుకులు కూడా ఆ విధంగా ఆలోచించడం సహజం. కాని ఈ ఆధునిక సమాజంలోని పరిస్థితులు వేరు. కోడళ్లు వేరుగా, స్వతంత్రంగా ఉండాలని అనుకుంటున్నారు. ఇలాంటి భావనలకి ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రుల నుంచి వేరుగా ఉంటూ తల్లిదండ్రుల యోగక్షేమాలు చూస్తున్న పిల్లలు ఎంతోమంది కన్పిస్తున్నారు.

10/08/2016 - 22:30

రోజూ రకరకాలైన వ్యక్తులని మనం చూస్తూ ఉంటాం. రకరకాల మనుష్యులు మనకు తారసపడుతూ ఉంటారు. అందులో కొంతమంది మనకు సన్నిహితులు ఉండవచ్చు. కొద్దిపాటి పరిచయం వున్న వాళ్లు వుండవచ్చు. ఇంకా కొంతమంది అపరిచితులూ ఉండవచ్చు.

10/02/2016 - 00:12

జీవితంలో మంచి రోజులతోపాటు దుర్దినాలు అందరికీ వస్తాయి. ఆరోగ్యంతోపాటు అనారోగ్య సమస్యలు అందరినీ బాధిస్తాయి. అందులో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. అనుకోని భయాలు, పేదరికం, నిస్సహాయత ఇట్లా ఎన్నో, చాలామందిని వేటాడుతుంటాయి. ప్రపంచంలోని సమస్యలన్నీ తమకే వచ్చినట్టుగా చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. సమస్యలు అందరికీ ఉంటాయి. కొందరివి బహిర్గతమవుతాయి. మరి కొందరివి కావు.

Pages