S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ చిన్నమాట!

12/12/2015 - 18:23

కోర్టుల్లో కేసుల సంఖ్య ఎక్కువ. పనిభారంతో అవి ఒత్తిడికి గురవుతున్నాయి. మరీ ముఖ్యంగా కుటుంబ న్యాయస్థానాల్లో విపరీతమైన పనిభారం. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.
విడాకుల కోసం వస్తున్న వ్యక్తుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. ఆర్థిక స్వాతంత్య్రం ఎక్కువగా ఉండటంవల్ల ఈ సంఖ్య పెరుగుతోందా? బంధాలని అర్థం చేసుకోకపోవడం వల్ల పెరుగుతుందాన్న విషయం పరిశోధించాల్సిందే.

12/05/2015 - 18:03

కోళ్ళఫారమ్‌లో కోళ్లని పెంచినట్టు
మనం ఇక్కడ పిల్లల్ని పెంచుతాం
మన ఇరుపక్కల ఉన్న కోళ్లతోని
మన ముందున్న కోళ్లతోని
మన కిందా పైనా వున్న కోళ్లతోని
మనకి సంబంధాలుండవు
వాటితో మాట్లాడుకోవడం కానీ
వాటిని ముక్కులతో పొడుచుకోవడం కానీ
అసలే వుండదు.
* * *
నెలవంకల్ని చూపించడానికి
గోరుముద్దలు తినిపించడానికి
మన పిల్లలు బాల్ ఆడుకోవడానికి

11/28/2015 - 16:37

ఓ తల్లి గర్భంలో ఇద్దరు కవలలు. బహుశా ఏడెనిమిది నెలలు వారికి ఉండవచ్చు. ఆ రెండు కవలల మధ్య సంభాషణ ఈ విధంగా కొనసాగుతోంది.
‘మనం పుట్టిన తరువాత జీవితం ఉంటుందా?’
‘ఎందుకుండదు? ప్రసవం తరువాత ఎంతో కొంత జీవితం ఉంటుంది. ప్రసవం తరువాత మనం ఎలా ఉండాలో దానికి సన్నద్ధం కావడం కోసమే మనం ఇక్కడ వున్నాం’ జవాబు చెబుతుంది పుట్టబోయే మరో బిడ్డ.

11/21/2015 - 22:15

ఓ దేవత నాకు స్వర్గం చూపిస్తున్నట్టుగా కల వచ్చింది. చాలామంది దేవతా స్ర్తిలు పనిచేస్తూ కన్పించారు.
మేం చూస్తున్న మొదటి ప్రాంతం రద్దీగా కన్పించింది. ఎంతోమంది దేవతా స్ర్తిలు తమకు వచ్చిన దరఖాస్తులను సరిచేస్తూ కన్పించారు. వాళ్లు చాలా పని వత్తిడిలో వున్నట్టు కన్పించారు. లెక్కలేనన్ని దరఖాస్తులు కన్పించాయి.
అక్కడి నుంచి రెండో ప్రాంతానికి వెళ్లాం. అది కూడా పెద్ద గది.

Pages