S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ చిన్నమాట!

06/11/2017 - 00:56

కుక్కల నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయో నేర్చుకోకూడనివి కూడా అనే్న ఉన్నాయి.
చిన్నప్పుడు మా ఇంట్లో ఓ చిన్న కుక్క ఉండేది. దానితో ఆడుకోవడం గొప్ప సరదాగా ఉండేది. దాని మెడకు ఓ గొలుసు వేసి ఎప్పుడన్నా దాన్ని బయటకు తీసుకొని వెళ్లేవాళ్లం. ఓ రోజు మా మేనమామతో కలిసి మా పెంపుడు కుక్కని తీసుకొని బయటకు వెళ్లాను.

06/04/2017 - 01:01

వాట్సప్‌లు వచ్చిన తరువాత చాలా సౌకర్యాలు పెరిగాయి. మాట్లాడుకోవచ్చు. అదే విధంగా చూస్తూ మాట్లాడుకోవచ్చు. వీడియోలు పంపుకోవచ్చు. ఫొటోలు సరేసరి! అలా త్వగరా ప్రపంచవ్యాప్తంగా స్నేహితులతో, పిల్లలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవచ్చు. బ్రాడ్‌కాస్ట్ లిస్ట్‌లో ఒకే ఒక్కసారి బటన్ నొక్కి వందల మందికి సమాచారాన్ని పంపించుకునేందుకు వీలవుతుంది.

05/20/2017 - 20:47

చదరంగం ఆటని జాగ్రత్తగా గమనిస్తే చాలా విషయాలు మనకి బోధపడతాయి. సైనికుడు (పాన్) ఎప్పుడూ ముందు అడుగు వేస్తాడు. అతనికి వెనక అడుగు వేసే అవకాశం లేదు. ‘రాజు’ ఒక్క అడుగు మాత్రమే వేస్తాడు. అన్ని వైపులా అడుగు వేసే అవకాశం ఉంటుంది. వెనక్కి కూడా అడుగు వేయవచ్చు. కానీ ఎప్పుడూ రక్షణలో ఉంటాడు. ఒక్క గుర్రం మాదిరిగా తప్ప, మంత్రి అందరిలా నడుస్తాడు.

05/07/2017 - 05:34

కథలు, నవలలు చదివే వాళ్లకి చివరికి ఏమీ జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆతురత ఉంటుంది. చాలా మంది మొత్తం పుస్తకం చదవకుండా చివరి పేజీ చదవడానికి ప్రయత్నం చేస్తూంటారు. కొన్నిసార్లు అది చివరి పేజీ కావొచ్చు. మరి కొన్నిసార్లు చివరి అధ్యాయం కావొచ్చు.

05/05/2017 - 23:04

దాదాపు నలభై సంవత్సరాల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలోని ‘లా’ కాలేజీలో జాయిన్ అయ్యాను. వారాల ఆనంద్ కూడా అప్పుడు యూనివర్సిటీకి వచ్చాడు. కాలేజీ నుంచి యూనివర్సిటీ ప్రయాణం ఆ కాలంలో ఓ గొప్ప అనుభవం. ఓ విశాల ప్రపంచంలోకి వచ్చిన అనుభూతి. చాలా స్వేచ్ఛ.

04/29/2017 - 21:12

‘మీరెవరు’ అని ఎవరైనా అడిగితే చాలామంది తాను డాక్టర్‌నని, ఇంజనీర్‌నని, అధికారినని, వ్యాపారవేత్తనని చెబుతారు. జీవితంలో ఎంతో కొంత విజయం సాధించిన వ్యక్తులకి ఇలా చెప్పుకునే పరిస్థితి వుంటుంది. అలా లేని వ్యక్తులు చాలామంది వుంటారు. అలాంటి వ్యక్తులు ఎలాంటి జవాబు చెప్పకుండా తటపటాయిస్తారు. జీవితంలో ఓడిపోకపోయినా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మామూలు వ్యక్తిగా వుండే పరిస్థితి ఏర్పడి వుండవచ్చు.

04/17/2017 - 07:34

ఈ మధ్య కవి మిత్రుడు వఝల వూరుని వదిలిపెట్టిన మిత్రులతో ఓ వాట్సప్ గ్రూపు తయారుచేశాడు. దానికి ‘‘వేములవాడ యాదిలో...’’ అని పేరుపెట్టాడు. అంటే అందరూ ఊరు జ్ఞాపకాల్లో పడిపోయారు. పాత ఫొటోలు, అప్పటి ఊరు చిత్రాలు - ఇట్లా ఎన్నో పంచుకోవడం మొదలుపెట్టారు.

04/11/2017 - 23:09

పొగడ్తని చాలామంది ఇష్టపడ్తారు. పొగడ్తకి ప్రశంసకి భేదం ఉంది. తెలివైన వ్యక్తులు పొగడ్తని ఇష్టపడరు. కానీ ప్రశంసని ఇష్టపడ్తారు. ప్రశంసని ఇష్టపడని వ్యక్తులు ఎవరూ ఉండరు. అందరూ ప్రశంసని కోరుకుంటారు కానీ, ఇతరులని ప్రశంసించటానికి ఇష్టపడరు. ఇది లోకరీతి. కొంతమందికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. కొంతమంది చాలా గొప్పగా రాయగలరు. మరి కొంతమంది గొప్పగా పాడగలరు. ఇంకా కొంతమంది మంచి చిత్రాలు గీయగలరు.

04/02/2017 - 22:34

చాలా విషయాలు చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ పాటించడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రతి పరిస్థితి నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. చూసే గుణం ఉండాలి. నేర్చుకోవాలన్న తపన ఉండాలి.
ప్రతి వస్తువూ, ప్రతి పరిస్థితి తన నుంచి ఎంతో కొంత నేర్చుకొమ్మని చెబుతాయి.

03/30/2017 - 02:33

వాట్సప్‌లు వచ్చిన తరువాత మన 24 గంటల్లోని ఓ అరగంట కనీసం ఆ వాట్సప్ మెసేజ్‌లను చూడడానికే సరిపోతుంది. ప్రతి కొత్త ఆవిష్కరణల వెనక కొంత మంచీ చెడు ఎప్పుడూ ఉంటాయి. వాట్సప్‌ల విషయంలోనూ అంతే! దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దుర్వినియోగం చేసుకోవచ్చు. దుర్వినియోగం చేసుకుంటున్న వ్యక్తుల సంఖ్యే ఎక్కువగా కన్పిస్తుంది.

Pages