ఓ చిన్నమాట!

పులి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి సంఘటనలోనూ రెండు రకాలైన అంశాలు ఉంటాయి. అందులో ఆశావహ కోణం ఉంటుంది. వ్యతిరేక భావన కోణం ఉంటుంది. మనలో చాలామంది ఆశావహ కోణంకన్నా వ్యతిరేక భావనని ఎక్కువగా గ్రహిస్తారు.
థామస్ అల్వా ఎడిసన్ విషయం తీసుకుంటే ఆయన బల్బును కనుక్కోవడానికి వేయి ప్రయోగాలు చేసి విఫలమయ్యాడు. ఈ విషయం పిల్లలకు చెబితే నేను రెండుసార్లే ఫెయిల్ అయ్యాను. ఎడిసన్ కన్నా తనే మెరుగు అనుకునే పిల్లలే ఎక్కువ. ఎడిసన్ ఈ విషయం గురించి చాలా మంచి సమాధానం చెప్పాడు.
‘వేయి రకాలుగా బల్బును చేయడానికి అవకాశం లేదన్న విషయాన్ని నేను కనుగొన్నాను’
ఏమీ కష్టపడకుండా ఫలితాలు రావాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. శక్తి సామర్థ్యాలు వున్నా కూడా పని చేయడానికి బద్దకించే వ్యక్తులు ఎక్కువగా కన్పిస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన ఓ కథ ఈ మధ్య చదివాను.
ఓ వ్యక్తి అడవి గుండా వెళ్తుంటాడు. అతని రెండు కాళ్లు విరిగి నడవడానికి కష్టంగ ఉన్న ఓ నక్క కన్పిస్తుంది. దాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు.
‘రెండు కాళ్లు విరిగి నడవలేని స్థితిలో వున్న ఈ నక్క ఎలా తన ఆహారాన్ని సమకూర్చుకుంటుంది’ అని అతను అనుకుంటాడు.
సరిగ్గా ఆ సమయంలోనే ఓ పులి తన నోట్లో ఓ జంతువును పట్టుకొని అక్కడికి వస్తుంది. అది చూసి అతను అక్కడ వున్న ఓ చెట్టు ఎక్కి ఆ పులివైపు చూస్తూ ఉంటాడు.
తనకు అవసరమైన మేర తిని మిగిలిన ఆహారాన్ని అక్కడే వదిలేసి ఆ పులి అక్కడి నుండి వెళ్లిపోతుంది. పులి వెళ్లిపోయిన తరువాత నక్క ఆ మిగిలిన ఆహారం దగ్గరకు వెళ్లిదాన్ని భుజిస్తుంది.
‘్భగవంతుడు ఎంత గొప్పవాడు. ఈ నక్కకు ఎంత మంచిగా ఆహారాన్ని ప్రసాదించాడు. తనకు కూడా అలాగే ప్రసాదిస్తాడనుకొని ఇంటికి వెళ్లి పడుకుంటాడు.
కానీ ఏమీ జరుగదు.
తెల్లవారుతుంది.
అలాగే అతను భగవంతుడు ఆహారం ప్రసాదిస్తాడేమోనని ఎదురుచూస్తూ పడుకుంటాడు. అలా నాలుగు రోజులు ఎదురుచూస్తాడు. ఏమీ జరుగదు. ఎందుకిలా జరుగుతుందని అతను ఆలోచిస్తున్న తరుణంలో ఆకాశవాణి ఇలా అడుగుతుంది.
‘ఆ కాళ్లు విరిగిన నక్కలా ఉండాలని ఎందుకు చూస్తున్నావు. భగవంతుడు నీకు శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు. నీకే కాదు. ఈ ప్రపంచానికి ఎంతో కొంత సహకారం అందించే తెలివితేటలు ఇచ్చాడు. కష్టపడకుండా తేరగా రావాలని ఎందుకు అనుకుంటున్నావు. నడువలేని నక్కని ఎందుకు అనుకరిస్తున్నావు. పులిలా బతకవచ్చు కదా?’
ఈ ప్రశ్న అందరూ వేసుకోవాలి. నక్కలా వుండాలా పులిలా బతకాలా?

- జింబో 94404 83001