S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంతృప్తి

నేను రాసిన కథలని, కవిత్వాన్ని పుస్తక రూపంలో ప్రచురించాలని అనుకున్నాను. అది ఏప్రిల్ నెలలోగా ప్రచురించాలని కూడా నిర్దేశించుకున్నాను. కానీ అది సఫలం కాలేదు. అగస్టు నెల కూడా వచ్చేసింది. ఒకరిద్దరు మిత్రులు ఆ విషయం గుర్తు చేశారు. మా ఆవిడ కూడా గుర్తు చేసింది. వాళ్లకి ఎన్నో కారణాలు చెప్పాను. నా పనిఒత్తిడి, ఉద్యోగ బాధ్యతలు, ఇంటి బాధ్యతలు ఇలా ఎన్నో కారణాలు చెప్పి వాళ్లు మళ్లీ ఆ విషయం గుర్తు చేయకుండా చేశాను.
కథలు రెడీగా వున్నాయి. కవిత్వాలు రెడీగా ఉన్నాయి. వాటి ప్రచురణ కోసం కేటాయించిన డబ్బులూ ఉన్నాయి. ప్రూఫ్ రీడింగ్ మాత్రమే మిగిలి ఉంది. నాలుగు నెలల కాలం గడిచిపోయింది.
ఇలా ఎన్నో లక్ష్యాలు మనం ఏర్పరచుకుంటాం. కానీ వాటిని పూర్తి చేయడంలో అలక్ష్యం చేస్తూ ఉంటాం. ఈ లక్ష్యాలని చేరువ కావడంలో వున్న సామర్థ్యం గురించి ఎవరిని మనం సంతృప్తి పరచాల్సి ఉంటుంది?
ఒక్క పుస్తక ప్రచురణకి దీన్ని పరిమితం చేయదల్చుకోలేదు. ఉద్యోగి ఏర్పరచుకున్న లక్ష్యాలు, వ్యాపారి ఏర్పరచుకున్న లక్ష్యాలు ఇలా ఎన్నో.
ఈ లక్ష్యాలు పూర్తి చేయనప్పుడు మనం ఎవరిని సంతృప్తిపరచాలి...?
మన లక్ష్యాలని, మన గోల్స్‌ని గుర్తుచేసే స్నేహితులని, కుటుంబ సభ్యులని సంతృప్తి పరచాలా?
మన మీద విశ్వాసం వుంచిన వ్యక్తులని సంతృప్తి పరచాలా?
మనలని విమర్శించే వ్యక్తులని సంతృప్తి పరచాలా?
మనలని సృష్టించిన భగవంతుడిని సంతృప్తి పరచాలా...?
మన పై అధికారినా...?
మన భార్యాపిల్లలా..?
మన కుటుంబ సభ్యులా..?
మరి ఎవరు...?
ఈ ప్రపంచంలో మనం సంతృప్తి పరచాల్సిన వ్యక్తి ఒకరే ఒకరు.
అది మనమే!
ఎవరికి వారే!
మన శక్తిసామర్థ్యాల గురించి, మన సమయం గురించి మనం సంతృప్తి పరచాల్సింది మనల్నే.
కొన్నిసార్లు తప్ప - మన శక్తిసామర్థ్యాలు మనకి తెలుసు.
మనలో వున్న శక్తి సామర్థ్యాలని మనం విశ్వసిస్తే, ఈ విషయం గురించి మనని మనం సంతృప్తి చెందితే ఈ ప్రపంచంలో ఎవరూ మనలని ఆపలేరు.
ఇది సత్యం.

- జింబో 94404 83001