మేకపిల్లలు.. యోగా
Published Saturday, 29 July 2017ప్రపంచం అంతటా ఇప్పుడు యోగామంత్రం వినిపిస్తోంది. మానసిక, శారీరక ఆరోగ్య రక్షణకు యోగా అద్భుతంగా పనిచేస్తోందని ఇప్పుడంతా విశ్వసిస్తున్నారు. అయితే అమెరికాలో ఇప్పుడు ఈ యోగా శిక్షణకు సరికొత్త హంగులు జోడిస్తున్నారు. నైజిరియాకు చెందిన డ్వార్ఫ్‌గోట్స్ అతి చిన్నగా, ముద్దుగా ఉంటాయి. యోగా శిక్షణ ఇచ్చే చోట వాటిని వదులుతున్నారు. యోగాచేస్తున్నవారి వీపులపై అవి ఎక్కి సందడి చేస్తున్నాయి. కొన్నిసార్లు యోగా చేస్తున్నవారి చెంత కలియదిరుగుతూంటాయి. వాటి చేష్టలు మానసిక ప్రశాంతతకు కారణమవుతున్నాయని యోగా నేర్చుకునేవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది.