S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ చిన్నమాట!

03/18/2018 - 00:04

ఆ మధ్య ఓ మిత్రుడు భోజనానికి పిలిస్తే వెళ్లాను. నగరానికి దూరంగా ఖాజాగూడలో అతను ఉంటున్నాడు. అది కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ప్రతి నెలకి దాని రూపురేఖలు మారిపోతున్నాయి. ఒకసారి గతంలో వచ్చినప్పటికీ అతని ఇల్లు వెతుక్కోవటంలో ఇబ్బంది ఎదురైంది. గూగుల్ మ్యాప్ సహాయం తీసుకున్నా అతని ఇంటిని సరిగ్గా తెలుసుకోలేక పొయ్యాను. అందుకని అతనికి ఫోన్ చేశాను. వాళ్ల డ్రైవర్‌ని నేను వున్న ప్రదేశానికి పంపించాడు.

03/10/2018 - 22:16

సాంకేతిక యుగంలో ఎన్నో కొత్త పరికరాలు, పనిముట్లు. ఈ పనిముట్లతో ఎన్నో సౌకర్యాలు. మరెన్నో అసౌకర్యాలు.
స్మార్ట్ఫోన్లు వచ్చిన తరువాత మనుషుల ప్రవర్తన పూర్తిగా మారిపోయింది.
వాట్సప్‌లు, టెలిగ్రామ్‌లు, ట్విట్టర్లు, సోషల్ మీడియాలో చాట్స్. ఇట్లా వాటిల్లో పూర్తిగా మునిగిపోతున్నారు. వాట్సప్‌లలో ఎన్నో గ్రూప్‌లు. అందులో ఎన్నో బొమ్మలు, వీడియోలు.
ఇలా అందరూ కొట్టుకొని పోతున్నారు.

03/07/2018 - 04:13

ప్రముఖ కథారచయిత మునిపల్లె రాజుగారు మరణించారన్న వార్త ఆలస్యంగా తెలిసింది. ఆయన శనివారం చనిపోతే ఆదివారం ఉదయం వరకు నాకు తెలియలేదు. శ్రీపతిగారికి ఫోన్ చేశాను. ఆయన శనివారం నాడే మంజుశ్రీ గారితో కలిసి చూసి వచ్చానని చెప్పారు.
చివరికి రాజుగారి ఇంటికి ఫోన్ చేశాను. ఆదివారం ఉదయం 10.30 గం.ల వరకు ఆయన పార్థీవ శరీరం ఇంట్లో ఉంటుందని, ఆ తరువాత స్మశానవాటికకు తీసుకొని వెళ్తారని ఆయన కోడలు చెప్పారు.

02/24/2018 - 23:15

ఉదయం పూట నడవడం అలవాటై పోయింది. ఆ తరువాత అంతా పరుగే.
నడక నాకిష్టం.
ఇది నడవడానికి వీల్లేని రోడ్డు.
ఎక్కడైనా ఇంత బండ్ల బాట వుంటే ఎంత బాగుండు
ఎందుకంటే నడక నాకిష్టం.
అంటాడు ‘కన్నరోడ్డు’ అన్న కవితలో ఓ కవి.

02/17/2018 - 21:38

ఆమధ్య అమెరికా వెళ్లినప్పుడు చాలా షాపింగ్ మాల్స్‌కి తిప్పాడు మా అబ్బాయి అనురాగ్. వాల్‌మార్ట్ లాంటి వాటిని ఎన్నో చూశాను. అక్కడ ఓ విషయం గమనించాను. మనం కొన్న వస్తువులని తిరిగి ఇచ్చి మళ్లీ కొత్తవి తీసుకునే అవకాశం అక్కడ ఉంది. దానికి వాళ్లు ఇచ్చిన సమయం కూడా మరీ ఎక్కువ. షాపుల్లోకి వెళ్లినప్పుడు ఉత్సాహంగా కొనేస్తాం. ఇంటికి వచ్చిన తరువాత మన అభిప్రాయం మారిపోతుంది.

02/10/2018 - 23:54

దాదాపు ఇరవై సంవత్సరాల క్రిందటి మాట. పోలీస్ అకాడమీలో డిప్యుటేషన్ మీద పని చేసిన తరువాత హైదరాబాద్‌లో 17వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌గా పోస్ట్ చేశారు. మూడున్నర సంవత్సరాల తరువాత మళ్లీ మేజిస్ట్రేట్ ఉద్యోగానికి వచ్చాను.

02/03/2018 - 20:46

నేను మూడు డిగ్రీలు తీసుకున్నప్పటికీ ఎప్పుడూ స్నాతకోత్సవ సభలో పాల్గొనలేదు. మా అబ్బాయి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్‌కి అమెరికా వెళ్లాలని అనుకున్నాను. కానీ కోర్టులో పని ఒత్తిడి వల్ల వెళ్లలేక పోయాను. మా అమ్మాయి స్నాతకోత్సవ సభలో కూడా పాల్గొనలేక పోయాను.

01/27/2018 - 23:52

‘జాతర’ అన్న పదం వింటే ఒళ్లు పులకరిస్తుంది. అది మేడారం జాతర కావొచ్చు. నాగోబా జాతర కావొచ్చు. మా వేములవాడ జాతర కావొచ్చు.

01/19/2018 - 18:14

మాచిన్నప్పుడు మా టీచర్ ఒక్క లెక్కని మూడుసార్లు చేయించేవాడు. అలా ఎందుకు చేయించేవాడో అప్పుడు అర్థం కాలేదు. ఆయన ఒక్క మాట చెప్పేవాడు ‘అవసరమైన దానికన్నా ఎక్కువ చేయాలి’. ఆ మాట అర్థం చాలా రోజులకి అర్థం అయ్యింది.

01/14/2018 - 23:47

సంక్రాంతి సమయంలోనే గంగిరెద్దులు కన్పించేవి.
సంక్రాంతి సమయంలోనే రేణగాయలు కన్పించేవి.
సంక్రాంతి సమయంలోనే ముగ్గులు ఎక్కువగా కన్పించేవి.
సంక్రాంతి సమయంలోనే గొబ్బెమ్మలు కన్పించేవి.
ఎద్దుని ఎంతో అందంగా అలంకరించి తీసుకొని వచ్చేవాళ్లు గంగిరెద్దుల వాళ్లు. వాళ్ల పాటకు గంగిరెద్దు నాట్యం చేసేది. నమస్కారం చేయమంటే చేసేది.

Pages